ఉద్యోగుల రైలుకి.. పచ్చజెండా

ABN , First Publish Date - 2020-11-28T04:44:44+05:30 IST

రైళ్ల పునరుద్ధరణలో భాగంగా లింగంపల్లి - విజయవాడ - లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌(ఉద్యోగుల) రైలుని పట్టాలెక్కించేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

ఉద్యోగుల రైలుకి..  పచ్చజెండా

డిసెంబరు 9వ తేదీ నుంచి పట్టాలెక్కనున్న ఇంటర్‌సిటీ 

11 నుంచి నరసపూర్‌ - నాగర్‌సోల్‌(షిర్డి)  రైలు రాకపోకలు 

గువహటి, విశాఖపట్టణం ఏసీ ఎక్స్‌ప్రెస్‌ల సమయాల మార్పు


గుంటూరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రైళ్ల పునరుద్ధరణలో భాగంగా లింగంపల్లి - విజయవాడ - లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌(ఉద్యోగుల) రైలుని పట్టాలెక్కించేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. డిసెంబరు నెల 9వ తేదీ నుంచి నెంబరు. 02795 విజయవాడ - లింగంపల్లి ఇంటర్‌సిటీ ప్రత్యేక రైలు సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి 5.45కి మంగళగిరి, 6.15కి గుంటూరు, రాత్రి 10.15కి సికింద్రాబాద్‌, 10.30కి బేగంపేట, 11.20కి లింగంపల్లి చేరుకొంటుంది. నెంబరు. 02796 లింగంపల్లి - విజయవాడ ఇంటర్‌సిటీ ప్రత్యేక రైలు డిసెంబరు 10వ తేదీ నుంచి నిత్యం వేకువజామున 4.40 గంటలకు బయలుదేరి 4.58కి బేగంపేట, 5.20కి సికింద్రాబాద్‌, ఉదయం 9.23కి గుంటూరు, 9.42కి మంగళగిరి, 10.30 గంటలకు విజయవాడ చేరుకొంటుంది. ఇదేవిధంగా లాక్‌డౌన్‌ ముందు వరకు వారానికి రెండు రోజుల పాటు గుంటూరు మీదగా రాకపోకలు సాగించిన నర్సపూర్‌ - నాగర్‌సోల్‌(షిర్డి) ఎక్స్‌ప్రెస్‌ని కూడా డిసెంబరు 11వ తేదీ నుంచి పునరుద్ధరించేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. నెంబరు. 07231 నరసపూర్‌ - నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆ తేదీ నుంచి ప్రతీ ఆది, శుక్రవారాల్లో ఉదయం 11.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45కి నాగర్‌సోల్‌ చేరుకొంటుంది. నెంబరు. 07232 నాగర్‌సోల్‌ - నరసాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ డిసెంబరు 12వ తేదీ నుంచి ప్రతీ సోమ, శనివారంలలో మధ్యాహ్నం 12.50 గంటలకు బయలుదేరి ఉదయం 9.40కి నరసాపూర్‌ చేరుకొంటుంది. ఈ రైలుకు సికింద్రాబాద్‌ - గుంటూరు మధ్యన ఎలాంటి నిలుపుదల సౌకర్యం కల్పించలేదు. 

పలు రైళ్ల సమయాల సవరణ


ప్రస్తుతం వారానికి ఒకసారి గుంటూరు మీదుగా రాకపోకలు సాగిస్తున్న గువహటి - సికింద్రాబాద్‌ - గువహటి ప్రత్యేక రైలు సమయపట్టికని రైల్వే శాఖ సవరించింది.  డిసెంబరు 3వ తేదీ నుంచి నెంబరు. 02514 గువహటి - సికింద్రాబాద్‌ రైలు ప్రతీ గురువారం ఉదయం 6.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.25 గంటలకు గుంటూరు, అర్ధరాత్రి దాటాక 3.35కి సికింద్రాబాద్‌ చేరుకొంటుంది. ఈ రైలుకు గుంటూరు - సికింద్రాబాద్‌ మధ్యన  నిలుపుదల సౌకర్యం కల్పించలేదు. నెంబరు. 02513 సికింద్రాబాద్‌ - గు వహటి ప్రత్యేక రైలు డిసెంబరు 5వ తేదీ నుంచి ప్రతీ శనివారం సా యంత్రం 4.35 గంటలకు బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 1 గం టకు గువహటి చేరుకొంటుంది. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌కి తిరుపతి నుంచి లింగంపల్లి వెళ్లేటప్పుడు పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ స్టేషన్లలో నిలుపుదల సౌకర్యం తొలగించారు. నరసాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌కి లింగంపల్లి వెళ్లేటప్పుడు నల్గొండలో, తిరుగుప్రయాణంలో మం గళగిరిలో నిలుపుదల సౌకర్యాన్ని ఎత్తేశారు. శబరి ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ వైపు వెళ్లేటప్పుడుఉదయం 6.35కు గుంటూరుకు వచ్చి 6.45కు బయలుదేరుతుంది. తిరువనంతపురం వైపునకు వెళ్లేటప్పుడు సాయంత్రం 5గంటలకు వచ్చి 5.10కి బయలుదేరుతుంది. వారంలో ప్రతీ బుధ, శుక్ర, ఆదివారాల్లో తిరుపతి - విశాఖపట్టణం ఏసీ డబుల్‌ డెక్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ న్యూగుంటూరుకు వేకువజామున 3.33కి వచ్చి 3.35కి బయలుదేరుతుంది. అలానే విశాఖపట్టణం - తిరుపతి ఏసీ డబు ల్‌డె క్కర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేకువజామున 5.55గంటలకు న్యూగుంటూరుకు వచ్చి 5.57కి బయలుదేరి మధ్యాహ్నం 12.45 గంటలకు తిరుపతి చేరు కొంటుంది. ప్రతీ శనివారం గుంటూరు మీదగా నడిచే సికింద్రాబాద్‌ - విశాఖపట్టణం ఏసీఎక్స్‌ప్రెస్‌  ప్రతీ శనివారం రాత్రి 9.35 బయలుదేరి అర్ధరాత్రి దాటాక 2.25కి గుంటూరు, మరుసటి రోజు ఉదయం 9.50కి విశాఖపట్టణం చేరుకొంటుంది. తిరుగులో ప్రతీ ఆదివారం రాత్రి 7.05 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి దాటాక 1.55 గంటలకు గుంటూరు, మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకొంటుంది.  


Updated Date - 2020-11-28T04:44:44+05:30 IST