ప్రత్యేక వడ్డన

ABN , First Publish Date - 2020-12-05T05:15:43+05:30 IST

కొవిడ్‌తో పట్టాలు తప్పిన రైల్వేలు.. ఇప్పటికీ గాడిన పడలేదు. నడిచే రైళ్లు తక్కువైనా ప్రయాణికులకు నర కం చూపిస్తున్నాయి.

ప్రత్యేక వడ్డన

 పండుగలు, స్పెషల్స్‌ పేరిట    రెట్టింపు చార్జీలు

రైళ్ల సమయాల్లోనూ భారీగా మార్పులు

ప్రయాణికులకు తప్పని అగచాట్లు.. 

సాధారణ రైళ్లు నడపాలని వినతి



(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

కొవిడ్‌తో పట్టాలు తప్పిన రైల్వేలు.. ఇప్పటికీ గాడిన పడలేదు. నడిచే రైళ్లు తక్కువైనా ప్రయాణికులకు నర కం చూపిస్తున్నాయి. కొవిడ్‌, పండుగ స్పెషల్స్‌ పేరిట నడుపుతున్న రైళ్లల్లోనూ సామాన్యుడికి స్థానం దక్కడం లేదు. ఒకప్పుడు జిల్లా మీదుగా రోజూ 40కు పైగా రైళ్లు నడుస్తుండగా.. ప్రస్తుతం పదింటికే పరిమితమయ్యా యి. వీటికి ముందస్తు రిజర్వేషన్‌ తప్పనిసరి చేయడం తోపాటు చార్జీలు ఎక్కువగానే వసూలు చేస్తున్నారు. ఏలూరు నుంచి విజయవాడ వెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్‌ చార్జ్‌ రూ.35 ఉండేది. ఇప్పుడు స్పెషల్‌ రైలు పేరిట రూ.75 వసూలు చేస్తున్నారు. సూపర్‌ ఫాస్ట్‌కు రూ.50 నుంచి రూ.90కు పెంచారు. ఇలా మొత్తం రైళ్లన్నింటిలోనూ చార్జీల్లో మార్పులు చేశారు. అదే సమయంలో రైలు ప్ర యాణ సమయాలను మార్పులు చేయడంతో సామా న్యులెవరూ తప్పనిసరైతే తప్ప.. రైళ్ల జోలికి వెళ్లడం లేదు. విశాఖపట్నం వైపు నడిచే కొవిడ్‌, పండుగ స్పెష ల్‌ రైళ్ల సమయాలు డిసెంబరు ఒకటిన మారిపోయా యి. ఒక్కొక్క రైలు రాకపోకల సమయం 20 నిమిషాల నుంచి నాలుగు గంటల వరకూ మారాయి. దీంతో ప్ర యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిసెంబ రు 1న ప్రారంభమైన రత్నాచల్‌ మినహా మిగిలిన రైళ్లన్నింటికీ టికెట్లు ముందుగానే బుక్‌ చేసుకున్నారు. యశ్వంత్‌పూర్‌ – విశాఖ ఎక్స్‌ప్రెస్‌ సమయాన్ని ఏకంగా ఒకరోజు ముందుకు జరిపారు. 5వ తేదీ ఉదయం 10.05 గంటలకు ఏలూరు వచ్చే ఈ రైలు డిసెంబరు 4వ తేదీ రాత్రి 11 గంటలకు వచ్చింది. అకస్మాత్తుగా వీటి సమయాలు మారిపోవడంతో ప్రయాణికులు ఇ బ్బందులు పడుతున్నారు. కొవిడ్‌ నిబంధనలను అను సరించి ముందుగా రావడంతో కొంత మంది రైలును అందుకోగలిగారు. సమయం లేకపోవడంతో చాలా మంది థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసుకోవడం లేదు.



సాధారణ రైళ్లకు  పెరుగుతున్న డిమాండ్‌

కరోనా ప్రభావం తగ్గడంతో లాక్‌డౌన్‌ ముగిసి రెండు నెలలు కావస్తు న్నా సాధారణ ప్యాసింజర్‌ రైళ్లను పునఃప్రారంభించలేదు. ప్రత్యేకం పేరు తో అదనంగా రెట్టింపు చార్జీలు వసూలు చేయడం ప్రయాణికుల్లో ఆగ్ర హం వ్యక్తమవుతోంది. చుట్టుపక్కల ప్రాంతాలకు ఉద్యోగాలు, రోజువారీ పనుల కోసం వెళ్లే మధ్య తరగతి వర్గం ఈ విషయంలో సీరియస్‌గా ఉంది. తక్షణం రైళ్లను పునరుద్ధరించాలన్న డిమాండ్‌  పెరుగుతోంది. 


ముందుగా ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నాం 

రిజర్వేషన్లు చేయించుకున్న వారికీ ముందుగానే ఎస్‌ఎంఎస్‌ ద్వారా మెసేజ్‌లు పంపుతున్నాం. వీటిని అనుసరించి అందరూ తమ ప్రయాణ షెడ్యూల్‌ను ముందుకు జరుపుకోవాలి. ప్రతి ప్రయాణికు డు రెండు గంటలు ముందుగా స్టేషన్‌కు రావాలి. థర్మల్‌ స్ర్కీనింగ్‌ టెస్టు చేయించుకునే స్టేషన్‌లో అడుగుపెట్టాలి. 

– సత్యనారాయణ, స్టేషన్‌ సూపరింటెండెంట్‌, ఏలూరు



ఏలూరు స్టేషన్‌లో.. మారిన రైళ్ల సమయాలు..


విజయవాడ నుంచి విశాఖ వైపునకు ..

రైలు  పేరు పాత సమయం కొత్త సమయం

రత్నాచల్‌ ఉ.గం. 6:50 ఉ.గం. 7:10

ప్రశాంతి ఉ.గం. 7:30 ఉ.గం. 6:10

కోణార్క్‌ మ.గం. 2:40 ఉ.గం. 10:40

గోదావరి రా.గం. 12:02 రా.గం. 11:50

ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రా.గం. 11:50 రా.గం. 10:28కి


డిసెంబరు 1 నుంచి ప్రారంభమైన రైళ్లు 

రత్నాచల్‌ రోజూ ఉదయం గం. 7:10లకు

నాగర్‌కోయల్‌– షాలిమర్‌ సోమవారం సాయంత్రం గం. 4.20

షాలిమర్‌– నాగర్‌కోయల్‌ గురువారం సాయంత్రం గం. 6.23లకు

కాకినాడ నుంచి షిర్డీ సాయినగర్‌ డిసెంబరు 5 నుంచి రైలు ప్రారంభం

Updated Date - 2020-12-05T05:15:43+05:30 IST