వైద్యులు.. అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-04-04T11:14:48+05:30 IST

జిల్లాలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్‌ కేసు నమోదుకానప్పటికీ అంతా అప్రమత్తంగా ఉండాలని ట్రైనీ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు.

వైద్యులు.. అప్రమత్తంగా ఉండాలి

 ట్రైనీ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌


విజయనగరం (ఆంధ్రజ్యోతి):జిల్లాలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్‌ కేసు నమోదుకానప్పటికీ అంతా అప్రమత్తంగా ఉండాలని  ట్రైనీ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు.  కరోనా నిర్మూలనకు ప్రభు త్వం, ప్రజలు చేస్తున్న యుద్ధంలో డాక్టర్లు, వైద్యనిపుణులు స్వచ్ఛం దంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. శుక్రవారం  కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని డాక్టర్లు, అసోసియేషన్లు, ప్రభుత్వ వైద్యశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.


ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇలాంటి విపత్కర సమయంలోనే సమాజానికి సేవచేయాలన్నారు.  కరోనా మహమ్మారిని  కలిసి కట్టుగా ఎదుర్కోవాలన్నారు. ఇందుకోసం వైద్యులు, సిబ్బంది సన్న ద్ధం కావాలని సూచించారు.  అనంతరం జిల్లాలోని ప్రైవేట్‌ ఆసు పత్రుల్లో వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విజయనగరం పార్వతీపురం, బొబ్బిలి ప్రాంతాల్లో సేవలందించేందుకు మూడు కమిటీలు వేశా మన్నారు. వారిని పర్యవేక్షించేందుకు ముగ్గురు డాక్టర్లతో కమిటీ వేశామని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్వో వెంకటరావు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ రమణ కుమారి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-04T11:14:48+05:30 IST