నాగోబాను దర్శించిన ట్రైనీ ఐఏఎస్‌లు

ABN , First Publish Date - 2021-04-11T07:08:59+05:30 IST

తెలంగాణకు కేటాయించిన 2019 బ్యాచ్‌ ఐఏఎస్‌ ట్రైనీ బృందం అధికారులు దీపక్‌తివారి, రిజ్వాన్‌బాషాషేక్‌, గరీమా అగర్వాల్‌, చిత్రమిశ్రా, అంకిత్‌, ప్రతిమసింగ్‌, వరుణ్‌రెడ్డి, హేమంత్‌పాటిల్‌లు శనివారం మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంద

నాగోబాను దర్శించిన ట్రైనీ ఐఏఎస్‌లు
అధికారులకు నాగోబా చరిత్రను వివరిస్తున్న మెస్రం వంశీయులు

ఇంద్రవెల్లి, ఏప్రిల్‌ 10: తెలంగాణకు కేటాయించిన 2019 బ్యాచ్‌ ఐఏఎస్‌ ట్రైనీ బృందం అధికారులు దీపక్‌తివారి, రిజ్వాన్‌బాషాషేక్‌, గరీమా అగర్వాల్‌, చిత్రమిశ్రా, అంకిత్‌, ప్రతిమసింగ్‌, వరుణ్‌రెడ్డి, హేమంత్‌పాటిల్‌లు శనివారం మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో ట్రైనీ ఐఎఎస్‌ అధికారులను శాలువలతో సన్మానం చేసి నాగోబా  చిత్రపటాలను అందించారు. ఈ సందర్భంగా మెస్రం పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు, ఉట్నూర్‌ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌ మెస్రం మనోహర్‌లు నాగోబా ఆలయ విశిష్ఠతను తెలిపారు. ఆలయ నిర్మాణం గురించి మెస్రం వంశీయులు సొంతంగా చందాలు చేసి ఆలయ నిర్మాణం చేసుకుంటున్నట్లు వివరించారు. ఇందులో ఐటీడీఏ ఎపీవో భీంరావు కనక, పరిపాలన అధికారి  సున్నం రాంబాబు, మెస్రం వంశీయులు మెస్రం నాగనాథ్‌, మెస్రం బాదిరావు పటేల్‌, మెస్రం శేఖ్‌నాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-11T07:08:59+05:30 IST