పరిశ్రమను సందర్శించిన ట్రెయినీ ఐఆర్‌ఎస్‌ బృందం

ABN , First Publish Date - 2021-10-17T04:55:10+05:30 IST

నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ నాగపూర్‌ 2020, 74వ బ్యాచ్‌కు చెందిన 61 మంది ట్రెయినీ ఇండియన్‌ రెవిన్యూ సర్వీసెస్‌ (ఐఆర్‌ఎస్‌) అధికారుల బృందం శనివారం పాశమైలారం కేజేఎస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమను సందర్శించింది.

పరిశ్రమను సందర్శించిన ట్రెయినీ ఐఆర్‌ఎస్‌ బృందం
మాట్లాడుతున్న డిప్యూటీ కమిషనర్‌ గాయత్రి

 పటాన్‌చెరు రూరల్‌, అక్టోబరు 16: నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ నాగపూర్‌ 2020,  74వ బ్యాచ్‌కు చెందిన 61 మంది ట్రెయినీ ఇండియన్‌ రెవిన్యూ సర్వీసెస్‌ (ఐఆర్‌ఎస్‌) అధికారుల బృందం  శనివారం పాశమైలారం కేజేఎస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమను సందర్శించింది. పరిశ్రమలు నడిచే విధానం, ఉత్పత్తి, గిడ్డంగుల విభాగం, ఆర్థిక విభాగాలు, అడ్మినిస్ట్రేషన్‌ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇన్‌కంట్యాక్స్‌ డిప్యూటీ కమిషనర్‌ గాయత్రి ఆధ్వర్యంలో  ఈ బృందం పలు ఫార్మా, టెక్స్‌టైల్స్‌ పరిశ్రమలను సందర్శించనున్నది. కాగా ట్రెయినీ ఐఆర్‌ఎస్‌ అధికారుల బృందానికి కేజేఎస్‌ పరిశ్రమ అధినేత గిరీష్‌ జైన్‌, డైరెక్టర్స్‌ సీపీ రాంక, నరేందర్‌ రెడ్డి, సర్వేశ్వరారావు ఘనస్వాగతం పలికి పరిశ్రమకు చెందిన పలు అంశాలను వారికి వివరించారు. ఈ సందర్భంగా బృందానికి నాయకత్వం వహించిన డిప్యూటీ కమిషనర్‌ గాయత్రి కార్యక్రమాన్ని ఉద్ధేశించి మాట్లాడుతూ  ఈ బృందంలోని ప్రతీ సభ్యుడు దేశ అభ్యున్నతికి పాటుపడతారని తెలిపారు. కేజేఎస్‌ పరిశ్రమ అధినేత గిరీష్‌ జైన్‌ మాట్లాడుతూ..  వివిధ రకాల ప్రపంచ స్థాయి తయారీ సంస్థల్లో ఒకటిగా కేజేఎస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మంచి గుర్తింపు పొందిందని వివరించారు. రాబోయే కాలంలో వేగంగా మార్కెట్‌లో వినియోగించే వస్తువుల తయారీకి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి, అందుకు అనుగుణంగా పరిశ్రమలు ముందుకు సాగాలని సూచించారు.  భవిష్యత్తులో వీలైనంత ఎక్కువగా యువతకు ఉపాధి కల్పించడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు చేపడతామన్నారు.  

Updated Date - 2021-10-17T04:55:10+05:30 IST