15 నుంచి శిక్షణ కేంద్రాల పునఃప్రారంభం

ABN , First Publish Date - 2020-07-05T08:01:20+05:30 IST

దేశవ్యాప్తంగా ఈనెల 15 నుంచి శిక్షణ కేంద్రాలను పునఃప్రారంభించేందుకు విధివిధానాలను సిబ్బంది మంత్రిత్వశాఖ జారీచేసిం ది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు....

15 నుంచి శిక్షణ కేంద్రాల పునఃప్రారంభం

సాధ్యమైనంత వరకు ఆన్‌లైన్‌లోనే కార్యక్రమాలు


న్యూఢిల్లీ, జూలై 4: దేశవ్యాప్తంగా ఈనెల 15 నుంచి శిక్షణ కేంద్రాలను పునఃప్రారంభించేందుకు విధివిధానాలను సిబ్బంది మంత్రిత్వశాఖ జారీచేసిం ది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ విధివిధానాలను శిక్షణ కేంద్రాలు తప్పనిసరిగా పాటించాలని మంత్రిత్వశాఖ సూచించింది. అదేవిధం గా శిక్షణ కార్యక్రమాలను సాధ్యమైనంత వరకు ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించాలని పేర్కొంది. డిజిటల్‌ వేదికగా నిర్వహించడం సాధ్యం కాకపోతే భౌతికదూరం పాటించడం, శానిటైజర్లు వినియోగించడం, మాస్కులు ధరించడం వంటి చర్యలు తీసుకొంటూ నేరుగా (ఫిజికల్‌ మోడ్‌ ద్వారా) నిర్వహించాలని వివరించింది. గర్భిణులు, బాలింతలు, హైబీపీ-ఊపిరితిత్తుల వ్యాధులున్నవారు ఆన్‌లైన్‌ ద్వారానే శిక్షణ కార్యక్రమాలకు హాజరు కావాలని సూచించింది.

Updated Date - 2020-07-05T08:01:20+05:30 IST