Abn logo
Sep 25 2021 @ 23:24PM

పొలంబడిలో రైతులకు శిక్షణ

వరి పొలాన్ని పరిశీలిస్తున్న ఏవో పద్మావతి, వ్యవసాయ సిబ్బంది

సిద్దవటం, సెప్టెంబరు25 : సిద్దవటం మండలం వంతాటిపల్లె గ్రామంలో శనివారం ఉదయం  రైతులకు పొలంబడి పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీడీఏ అశోక్‌రెడ్డి హాజరై రైతులకు అవగాహన కల్పించారు.ఏవోపద్మావతి, వ్యవసాయ ఉద్యాన సహాయకులు, ఏఈవో సరిత, ఎంపీఈవోలు తదితరులు పాల్గొన్నారు.