ఫిల్మ్‌ డైరెక్షన్‌, మేకింగ్‌లో శిక్షణ

ABN , First Publish Date - 2021-05-10T13:23:29+05:30 IST

ఆరు నెలలుగా రెండు స్ర్కిప్టు రైటింగ్‌ వర్క్‌షాపులు

ఫిల్మ్‌ డైరెక్షన్‌, మేకింగ్‌లో శిక్షణ

హైదరాబాద్‌ సిటీ : తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ, ఫరెవర్‌ ఫెంటాస్టిక్‌ థియేటర్స్‌(2ఎఫ్‌టీ) సంయుక్త నిర్వహణలో ఫిల్మ్‌ డైరెక్షన్‌, మేకింగ్‌లో శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు రంగస్థల సినీ దర్శకుడు, డాక్టర్‌ ఖాజాపాషా తెలిపారు. 9 వారాలపాటు (శని, ఆదివారాల్లో) సాయంత్రం 6.30 నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఆన్‌లైన్‌లో వర్క్‌షాప్‌ కొనసాగుతుందన్నారు. ఆరు నెలలుగా రెండు స్ర్కిప్టు రైటింగ్‌ వర్క్‌షాపులు నిర్వహించామని, 40 దేశాల నుంచి 450 మంది శిక్షణ పొందారన్నారు. ప్రముఖ రంగస్థల నిపుణులతోపాటు సినీ రచయిత, దర్శకులు పూరి జగన్నాథ్‌, ఎన్‌.శంకర్‌, దశరథ్‌, ఇంద్రగంటి మోహనకృష్ణ, డీఎస్‌ కన్నన్‌ తమ అనుభవాలు, మెలకువలు నేర్పినట్లు తెలిపారు.


ఈ శిబిరంలో పుణే, సత్యజిత్‌రే ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లతోపాటు నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు 24 క్రాఫ్ట్‌పై, సినిమా నిర్మాణంలో ఐడియా దశ నుంచి సినిమాను అమ్మే ప్రక్రియ వరకు ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు కూడా ఇస్తామన్నారు. వివరాలకు 93466-45411, 98489-49827 నంబర్లకు వాట్సప్‌ చేయాలన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రపంచంలో తెలుగు మాట్లాడే వారందరూ వర్క్‌షాప్‌‌లో పాల్గొనవచ్చన్నారు. క్లాసులు ఈనెల 22 నుంచి ప్రారంభంకానున్నాయని పేర్కొన్నారు.

Updated Date - 2021-05-10T13:23:29+05:30 IST