ఆర్టీసీ ఆధ్వర్యంలో హెవీ వెహికిల్‌ డ్రైవింగ్‌ లో శిక్షణ

ABN , First Publish Date - 2021-01-16T06:34:31+05:30 IST

ఆర్టీసీ ఆధ్వర్యంలో హెవీ మోటార్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ను నేర్చుకొనే అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్‌ఎం రాజశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఆర్టీసీ ఆధ్వర్యంలో హెవీ వెహికిల్‌ డ్రైవింగ్‌ లో శిక్షణ

సంగారెడ్డి అర్బన్‌, జనవరి 15 : ఆర్టీసీ ఆధ్వర్యంలో హెవీ మోటార్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ను నేర్చుకొనే అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్‌ఎం రాజశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 20 సంవత్సరాలు నిండి ఉండి, కనీసం ఏడాది పాటు లైట్‌ మోటార్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ అనుభవం కలిగి ఉండాలని సూచించారు. ఆసక్తి కలిగిన వారు రూ.15,600 రుసుం చెల్లించి డిపో మేనేజర్‌ కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9959226267, 9491710630, 7382831217 నంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. 

Updated Date - 2021-01-16T06:34:31+05:30 IST