థర్డ్‌వేవ్‌లో చిన్నపిల్లల వైద్యంపై శిక్షణ

ABN , First Publish Date - 2021-06-23T07:00:12+05:30 IST

బీబీనగర్‌లోని అఖిలభారత వైద్య విజ్ఞానసంస్థ (ఎయిమ్స్‌)లో కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌లో చిన్నపిల్లలకు అందించాల్సిన వైద్యసేవలపై శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ వికాస్‌ భాటియా తెలిపారు.

థర్డ్‌వేవ్‌లో చిన్నపిల్లల వైద్యంపై శిక్షణ
మాట్లాడుతున్న డైరెక్టర్‌ వికాస్‌ భాటియా

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా 

బీబీనగర్‌, జూన్‌ 22: బీబీనగర్‌లోని అఖిలభారత వైద్య విజ్ఞానసంస్థ (ఎయిమ్స్‌)లో కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌లో చిన్నపిల్లలకు అందించాల్సిన వైద్యసేవలపై శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ వికాస్‌ భాటియా తెలిపారు. ఎయిమ్స్‌లోని పీడియాట్రిక్‌ విభాగం ఆధ్వర్యంలో నర్సులకు ఏర్పాటు చేసిన 10 రోజుల శిక్షణ శిబిరాన్ని భాటియా మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. నాలుగైదు నెలల్లో కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ ప్రమాదం పొంచి ఉందని, దీని ప్రభావం పసిపిల్లల నుంచి 18 ఏళ్ల వారి వరకు ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు చిన్న పిల్లలకు అందించాల్సిన వైద్యంపై సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మల్టీసిస్టమ్‌ ఇన్‌ప్లా మెట్రిసిండ్రోమ్‌ గల చిన్నారులు కరోనా బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అలాంటి వారిని ప్రత్యేకంగా పరిగణించి వైద్యం అందించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం ఇద్దరు చిన్నపిల్లల వైద్యులతో నర్సులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎయిమ్స్‌ డీన్‌ నీరజ్‌ అగర్వాల్‌, మైక్రో బయాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ఎయిమ్స్‌ పీఆర్‌వో డాక్టర్‌ శ్యామల, చిన్న పిల్లల వైద్య నిపుణులు మదుసూదన్‌, మౌనిక తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T07:00:12+05:30 IST