ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ

ABN , First Publish Date - 2020-12-01T05:05:41+05:30 IST

వ్యవసాయ శిక్షణ మాదిరిగానే ప్రకృతి వ్యవసా యంపై డిప్లమా కోర్సు మంజూరుకు కృషి చేస్తానని గిరిజన విశ్వ విద్యాలయ వైస్‌ చాన్సలర్‌ టీవీ కట్టమణి అన్నారు.

ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ
సంస్థ ప్రచురించిన ప్రకృతి వ్యవసాయ పుస్తకాలను పరిశీలిస్తున్న కట్టమణి

గిరిజన యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌  టీవీ కట్టమణి

గరుగుబిల్లి, నవంబరు 30: వ్యవసాయ శిక్షణ మాదిరిగానే ప్రకృతి వ్యవసా యంపై డిప్లమా కోర్సు మంజూరుకు కృషి చేస్తానని గిరిజన విశ్వ విద్యాలయ వైస్‌ చాన్సలర్‌ టీవీ కట్టమణి అన్నారు. సోమవారం తోటపల్లి జట్టు ప్రకృతి ఆదిదేవో భవన సముదాయంలోని ప్రకృతి పద్ధతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రసాయనిక ఎరువులకు దూరంగా ఉంచుతూ, సహజ సిద్ధంగా అందు బా టులో ఉండే పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ, అధిక దిగుబడులు సాధించడంపై జట్టు సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్‌ డి.పారినాయుడును అభినందించారు.  తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే వాటిపై అవగాహన కల్పిస్తే మరింతగా ప్రకృతి సాగు వి స్తీర్ణం పెరిగే అవకాశం ఉందన్నారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు మార్కెటింగ్‌ చేసుకొనే వీలుగా రైతు సంఘాలు ఏర్పాటు చేయ డం ఉపయోగకరం అన్నారు. మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా నిర్వహిస్తు న్న పద్ధతులపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఈ ప్రాంతం ప్రకృతి శిక్షణ కేంద్రాని కి అనువుగా ఉందన్నారు. యూనివర్సిటీ ఏవో డాక్టర్‌ సూర్యనారాయణ, రాజాహిందీ కళాశాల కరస్పాండెంట్‌ డాక్టర్‌ మంచిపల్లి శ్రీరాములు, ఎం.గోపీనాథ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-12-01T05:05:41+05:30 IST