నిరుద్యోగులకు చక్కటి అవకాశం: జాబ్‌ ఓరియంటెడ్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2021-10-10T14:47:07+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ..

నిరుద్యోగులకు చక్కటి అవకాశం: జాబ్‌ ఓరియంటెడ్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

APESCDCలో ట్రెయింగ్‌ ప్రోగ్రామ్‌లు


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్‌డీసీ) - జాబ్‌ ఓరియంటెడ్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులు, చిరుద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణ ఉచితం. నిబంధనల ప్రకారం కోర్సులు పూర్తిచేసుకొన్నవారికి సర్టిఫికెట్‌లు ప్రదానం చేస్తారు. 


వెబ్‌సైట్‌: apssdc.in


మైక్రోసాఫ్ట్‌ డైవర్సిటీ స్కిల్లింగ్‌ ప్రోగ్రామ్‌

మహిళలకు డిజిటల్‌ ఎడ్యుకేషన్‌పై ఆసక్తి కలిగించేందుకు దీనిని ఉద్దేశించారు. ఎన్‌ఎస్‌డీసీ, మైక్రోసాఫ్ట్‌ సంస్థల సహకారంతో నిర్వహించే ఈ ప్రోగ్రామ్‌ వ్యవధి నెల. ఇందులో డిజిటల్‌ లిటరసీ, బేసిక్స్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌, ఎంప్లాయిబిలిటీ, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ మాడ్యూల్స్‌ ఉంటాయి. వారానికి ఒక మాడ్యూల్‌పై శిక్షణ ఉంటుంది. డిజిటల్‌ లిటరసీలో కంప్యూటర్స్‌, ఆన్‌లైన్‌ యాక్సెస్‌, ఆన్‌లైన్‌ కమ్యూనికేషన్‌, ఆన్‌లైన్‌ సేఫ్టీ, క్రియేట్‌ డిజిటల్‌ కంటెంట్‌, కొలాబరేట్‌ అండ్‌ మేనేజ్‌ కంటెంట్‌ డిజిటల్లీ అంశాలు వివరిస్తారు. బేసిక్స్‌ ఆఫ్‌ ఇంగ్లీ్‌షలో గ్రామర్‌, ఒకాబులరీ, ప్రజంటేషన్‌, ఆంగ్లంలో మాట్లాడే విధానాలు నేర్పిస్తారు. ఎంప్లాయిబిలిటీలో రెజ్యూమె మేకింగ్‌, ఆన్‌లైన్‌ జాబ్‌ సెర్చింగ్‌, ఇంటర్వ్యూ ప్రాసెస్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌, ఉమెన్‌ ట్రస్ట్‌ అండ్‌ ఫౌండేషన్స్‌, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ సంబంధిత అంశాలు వివరిస్తారు. 


ఆంత్రప్రెన్యూర్‌షిప్‌లో స్టార్టప్‌ జర్నీ, కిక్‌ స్టార్ట్‌ బిజినెస్‌, బిజినెస్‌ ఐడియాస్‌, ఫైనాన్స్‌ ఫర్‌ బిజినెస్‌, స్టార్టప్‌ యాక్టివిటీస్‌, బ్యాంకింగ్‌ అండ్‌ అకౌంటింగ్‌ అంశాలపై అవగాహన కల్పిస్తారు. తెలుగు మాధ్యమంలో ఆన్‌లైన్‌ సెషన్స్‌, వెబినార్‌ల ద్వారా తరగతులు నిర్వహిస్తారు. 


దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 30


ఎల్‌ అండ్‌ టీ సీఎస్‌టీఐ ట్రెయినింగ్‌

ఎల్‌ అండ్‌ టీ కన్‌స్ట్రక్షన్‌ స్కిల్స్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల సహకారంతో నిర్మాణ నైపుణ్యాలలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సమీపంలో నిర్దేశిత ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్‌కు సమీపంలోని జడ్చర్ల కేంద్రం అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉంటుంది. 


శిక్షణ అంశాలు: ఫార్మ్‌ వర్క్‌ వడ్రంగి, బార్‌ బెండింగ్‌ అండ్‌ స్టీల్‌ ఫిక్సింగ్‌, తాపీ పని, కన్‌స్ట్రక్షన్‌ ఎలక్ట్రీషియన్‌, వెల్డింగ్‌.

శిక్షణ వ్యవధి: వెల్డింగ్‌కు 60 రోజులు; మిగిలిన అన్నింటికీ 90 రోజులు 

అర్హత: దరఖాస్తు నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. అభ్యర్థులు కనీసం 155 సెం.మీల ఎత్తు, కనీసం 45 కేజీల బరువు ఉండాలి. అయిదో తరగతి ఉత్తీర్ణత చాలు. అంతకంటే ఎక్కువ చదివినవారు దరఖాస్తుకు అనర్హులు. ఎలక్ట్రీషియన్‌, వెల్డింగ్‌ అండ్‌ ప్లంబింగ్‌ ట్రేడ్‌లలో ఐటీఐ చేసినవారు సంబంధిత శిక్షణకు అప్లయ్‌ చేసుకోవచ్చు.   

దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 30


Updated Date - 2021-10-10T14:47:07+05:30 IST