చిరు ధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ

ABN , First Publish Date - 2020-02-28T11:27:28+05:30 IST

వివిధ రకాల చిరుధాన్యాలతో వాటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడానికి కలికిరి కృషి విజ్ఞాన కేంద్రంలో ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు

చిరు ధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తులపై శిక్షణ

కలికిరి, ఫిబ్రవరి 27: వివిధ రకాల చిరుధాన్యాలతో వాటి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడానికి కలికిరి కృషి విజ్ఞాన కేంద్రంలో ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు కేవీకే కోఆర్డినేటర్‌ రెడ్డికుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ ఈ శిక్షణ వుంటుందని, ఆసక్తి కలిగిన మహిళలు 85208 87745 లేదా 18004 250195 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. కాగా నాలుగు నెలల క్రితం ఇదే అంశంపై నిర్వహించిన శిక్షణకు పలువురు మహిళలు వివిధ రకాల చిరు ధాన్యాలతో 30 రకాల వంటకాల తయారీలో తర్ఫీదు పొందారు. సజ్జలు, రాగులు, కొర్రలు, జొన్నలు, ఆరికెలు, సామలు, ఊదలు, అండు కొర్రలు లాంటి వివిధ రకాల చిరుధాన్యాలతో మురుకులు, రిబ్బన్లు, వడలు, దోసెలు, ఇడ్లీలు, పలురకాల స్వీట్లు, ఉప్మా, పాయసంలాంటి 30 రకాల్లో శిక్షణ ఇచ్చి నేర్పించారు. స్వయం ఉపాధి కోసం ప్రయత్నించే మహిళలకు ఈ శిక్షణ బాగా ఉపయుక్తంగా వుంటుందని గతంలో శిక్షణ పొందిన మహిళలు అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2020-02-28T11:27:28+05:30 IST