పట్టాలపైకి.. మూడు రైళ్లు

ABN , First Publish Date - 2021-03-03T05:12:07+05:30 IST

కొవిడ్‌-19 అన్‌లాక్‌లో భాగంగా గుం టూరు డివిజన్‌కు చెందిన మరో మూడు రైళ్లని పునరుద్ధరించేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకొన్నది.

పట్టాలపైకి.. మూడు రైళ్లు

ఏప్రిల్‌ 1 నుంచి పల్నాడు పునరుద్ధరణ

ఏప్రిల్‌ 1న కాచిగూడ, 2న రేపల్లె నుంచి డెల్టా   ప్రారంభం

రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులకే అనుమతి


గుంటూరు, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 అన్‌లాక్‌లో భాగంగా గుం టూరు డివిజన్‌కు చెందిన మరో మూడు రైళ్లని పునరుద్ధరించేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకొన్నది. ఏప్రిల్‌ నెల ప్రారంభంలో పల్నాడు, డెల్టా, సిం హాద్రి ఎక్స్‌ప్రెస్‌లను పునరుద్ధరించనున్నది. సికింద్రాబాద్‌కి రాకపోకలు సాగిం చే ప్రాధాన్య రైళ్లలో నెంబర్‌ 1గా ఉండే పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ని ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ప్రత్యేక రైలుగా నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.  రిజర్వేషన్‌ చేసు కున్న ప్రయాణికులనే అనుమతిస్తారు. 

- నెంబరు 02747 గుంటూరు - వికారాబాద్‌ పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ నిత్యం వేకు వజామున 5.45 గంటలకు బయలుదేరి 6.23కి సత్తెనపల్లి, 6.48కి పిడుగురాళ్ల, 7.09కి నడికుడి, 7.,26కి విష్ణుపురం, 7.40కి మిర్యాలగూడ, 8.10కి నల్గొండ, 8.32కి చిట్యాల, 8.59కి నాగిరెడ్డిపల్లి, ఉదయం 10.35కి సికింద్రాబాద్‌, 10.52కి బేగంపేట, 10.58కి సనత్‌నగర్‌, 11.15కి లింగంపల్లి, 11.32కి శంకర్‌పల్లి, మధ్యాహ్నం 12.15కి వికారబాద్‌ చేరుకొంటుంది.

  - నెంబరు 02748 వికారబాద్‌ - గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ నిత్యం మధ్యాహ్నం 2.40కి బయలుదేరి 3.55కి సికింద్రాబాద్‌, సాయంత్రం 6.31కి నడికుడి, 6.51కి పిడుగురాళ్ల, 7.19కి సత్తెనపల్లి, రాత్రి 9 గంటలకు గుంటూరు చేరుకొంటుంది. ఈ రైలులో 17 సెకండ్‌ సిట్టింగ్‌, ఒక ఏసీ చైర్‌కార్‌, రెండు ఎస్‌ ఎల్‌ఆర్‌ బోగీలు కలిపి మొత్తం 20 ఉంటాయి. 

- నెంబరు 07625 కాచీగూడ - రేపల్లె డెల్టా ఎక్స్‌ప్రెస్‌ ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి నిత్యం రాత్రి 10.10 గంటలకు బయలుదేరి మల్కజ్‌గిరి, చర్లపల్లి, ఘట్‌కేసర్‌, బీబీనగర్‌ మీదగా వేకువజామున 3.25 గంటలకు గుంటూరు, 4 గంటలకు తెనాలి, 4.15కి చినరావూరు, 4.29కి వేమూరు, 4.38కి భట్టిప్రోలు, 4.45కి పల్లెకోన, 5.50కి రేపల్లె చేరుకొంటుంది. 

- నెంబరు 07626 రేపల్లె - కాచీగూడ ఎక్స్‌ప్రెస్‌ ఏప్రిల్‌ 2 నుంచి నిత్యం రాత్రి 10.40 గంటలకు బయలుదేరి 10.44కి పల్లెకోన, 10.49కి భట్టిప్రోలు, 10.59కి వేమూరు, 11.11కి చినరావూరు, 11.20కి తెనాలి, 11.40కి వేజెండ్ల, 11.50కి గుంటూరు, మరుసటి రోజు వేకువజామున 5.20కి ఘట్‌కేసర్‌, 5.30కి చర్లపల్లి, ఉదయం 7.05కి కాచీగూడ చేరుకొంటుంది. ఈ రైలుకు గుంటూరు - బీబీనగర్‌ మధ్య ఉన్న రైల్వేస్టేషన్లలో నిలుపుదల సౌకర్యం తొలగించారు. ఒక ఏసీ త్రీటైర్‌, ఎనిమిది స్లీపర్‌క్లాస్‌, 9 సెకండ్‌ సిట్టింగ్‌, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌ బోగీలు కలిపి మొత్తం 20 ఉంటాయి.  

 - నెంబరు 07239 గుంటూరు - విశాఖపట్టణం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఏప్రిల్‌ 2 నుంచి నిత్యం ఉదయం 8 గంటలకు బయలుదేరి 8.07కి పెదకాకాని, 8.14కి నంబూరు, 8,26కి మంగళగిరి, 8.55కి విజయవాడ చేరుకొని అదే రోజు సాయంత్రం 4 గంటలకు  విశాఖపట్టణం చేరుతుంది. 

- నెంబరు 07240 విశాఖపట్టణం - గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఏప్రిల్‌ 3 నుంచి ఉదయం 7.10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.50కి విజయవాడ, 2.12కి మంగళగిరి, 2.21కి నంబూరు, 2.26కి పెదకాకాని, 3.20కి గుంటూరు చేరుకొంటుంది. ఈ రైలులో 17 సెకండ్‌ సిట్టంగ్‌, ఒక ఏసీ చైర్‌కార్‌, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌ బోగీలుంటాయని సీనియర్‌ డీసీఎం డీ నరేంద్రవర్మ తెలిపారు. 

Updated Date - 2021-03-03T05:12:07+05:30 IST