యథావిధిగా రైళ్లు..

ABN , First Publish Date - 2021-11-26T05:34:38+05:30 IST

ఇటీవల కురిసిన భారీవర్షాలకు నెల్లూరు జిల్లా పడుగుపాడు వద్ద పూర్తిగా పట్టాలు దెబ్బతినడంతో మూడు రోజులుగా నిలిచిపోయిన రైళ్లు అక్కడ మరమ్మతులు పూర్తికావడంతో తిరిగి యథావిధిగా నడుస్తున్నాయి. తాత్కాలికంగా రద్దుచేసిన రైళ్లను ఆయా సమయాల్లో నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. బుధవారం రాత్రి నుంచి రద్దు చేసిన రైళ్లను తిరిగి పునరుద్ధరించడంతో రైలు ప్రయాణ ఇబ్బందులు తొలగాయి.

యథావిధిగా రైళ్లు..

ఒంగోలు మీదుగా నడుస్తున్న అన్ని ఎక్స్‌ప్రెస్‌లు

ఒంగోలు (కార్పొరేషన్‌), నవంబరు 25: ఇటీవల కురిసిన భారీవర్షాలకు నెల్లూరు జిల్లా పడుగుపాడు వద్ద పూర్తిగా పట్టాలు దెబ్బతినడంతో మూడు రోజులుగా నిలిచిపోయిన రైళ్లు అక్కడ మరమ్మతులు పూర్తికావడంతో తిరిగి యథావిధిగా నడుస్తున్నాయి. తాత్కాలికంగా రద్దుచేసిన రైళ్లను ఆయా సమయాల్లో నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. బుధవారం రాత్రి నుంచి రద్దు చేసిన రైళ్లను తిరిగి పునరుద్ధరించడంతో రైలు ప్రయాణ ఇబ్బందులు తొలగాయి. ఇదిలా ఉండగా కొన్ని రోజులుగా ప్యాసింజర్‌ రైళ్లు అందుబాటులో లేకపోగా, మరి కొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఇదిలా ఉండగా, ఆర్టీసీ ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. మొదట ఒకటి, రెండు రోజులు కొంతమేర ఆటంకం ఎదురైనా, ప్రస్తుతం తిరుపతి, చెన్నై, బెంగళూరు, నెల్లూరు వైపు ఆర్టీసీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

 

Updated Date - 2021-11-26T05:34:38+05:30 IST