తుపాన్ నేపథ్యంలో పలు రైళ్లు రద్దు

ABN , First Publish Date - 2020-11-26T13:29:23+05:30 IST

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.

తుపాన్ నేపథ్యంలో పలు రైళ్లు రద్దు

అమరావతి: నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. చెన్నై సెంట్రల్‌- తిరుపతి రైలు రైల్వే శాఖ రద్దు చేసింది. అలాగే హైదరాబాద్‌- తంబరం, మదురై- బికనీర్‌ రైళ్లు రద్దు అయ్యాయి. తుఫాన్‌ ప్రభావంతో పలు రైళ్లను దారి మళ్లించారు. 


తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ‘నివర్‌’ తుపాను తీరం దాటింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య నివర్‌ తుపాను తీరం దాటినట్లు వాతావరణశాఖ తెలియజేసింది. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో తుపాన్‌ ప్రభావంతో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరిలో లక్ష మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 50 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 

Updated Date - 2020-11-26T13:29:23+05:30 IST