శిథిలావస్థలో ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌ కంట్రోల్‌ రూం

ABN , First Publish Date - 2021-04-19T06:16:39+05:30 IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం చాడ ముత్తిరెడ్డిగూడెంలోని సబ్‌స్టేషన్‌లోని కంట్రో ల్‌ రూం పూర్తిగా శిథిలావస్థకు చేరింది.

శిథిలావస్థలో ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌ కంట్రోల్‌ రూం
పిచ్చి మొక్కలతో ఏపుగా పెరిగి ఉన్న ట్రాన్స్‌కో అధికారులకు కేటాయించిన భవనం

పొంచి ఉన్న ప్రమాదం

భువనగిరి రూరల్‌, ఏప్రిల్‌ 18: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం చాడ ముత్తిరెడ్డిగూడెంలోని సబ్‌స్టేషన్‌లోని కంట్రో ల్‌ రూం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. గ్రామంలోని జనావాసాల మధ్య 33/11కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సబ్‌స్టేషన్‌ నుంచి చాడ ముత్తిరెడ్డిగూడెం, కాటెపల్లి, నాంచారిపేట, కదిరేణిగూడెం, కొండాపురం తదితర గ్రామాలకు విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. అయితే అక్కడ ఆపరేటర్ల కోసం నిర్మించిన కంట్రోల్‌ రూం పూర్తి గా శిథిలావస్థకు చేరింది. కంట్రోల్‌ రూంకు సంబంధించి న తలుపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదే విధంగా ట్రాన్స్‌కో అధికారులకు కేటాయించిన గదులను వినియో గించనందున శిథిలావస్థకు చేరి ఆవరణలో పిచ్చి మొక్క లు ఏపుగా పెరిగాయి.   సబ్‌స్టేషన్లకు వెళ్లే ప్రధాన గేటు, సబ్‌ స్టేషన్‌ చుట్టూ రక్షణ గోడ లేనందున కాలనీవాసులు రాకపోకలు సాగిస్తున్నారు. సబ్‌స్టేషన్‌ ప్రధాన గేటు లేక పోవడం, కొంతమంది సబ్‌స్టేషన్‌ ఆవరణలో బైకులు, కార్లు పార్కింగ్‌ చేయడంతో ప్రమాదం పొంచి ఉందని పలువురు తెలిపారు. ప్రమాదం జరుగకముందే   ట్రాన్స్‌కో అధికారులు అప్రమత్తమై సంబంధిత గదులకు మర మ్మతు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని, అలాగే సబ్‌స్టేషన్‌ చుట్టూ ప్రహారీ నిర్మించి, కంట్రోల్‌ రూంకు మరమ్మత్తులు చేపటాలని పలువురు కోరుతున్నారు. 


 మరమ్మతు చేయాలి

 గ్రామంలోని సబ్‌స్టేషన్‌ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దీంతో ఉద్యో గస్తులకు, ప్రజల కు పెనుప్రమాదం పొంచి ఉంది. ట్రాన్స్‌కో అధికారులు ముందస్తుగా మరమ్మతు చర్యలు చేపట్టాలి. అదేవిధంగా సబ్‌స్టేషన్‌ చుట్టూ ప్రహరీ నిర్మించాలి. గతంలో ఈవిషయమై ట్రాన్స్‌కో అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. 

- ప్రభాకర్‌, ఉపసర్పంచ్‌ ముత్తిరెడ్డిగూడెం 


 ప్రతిపాదనలు పంపాం 

చాడ ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఉన్న 13/11 కేవీ సబ్‌స్టేషన్‌లో శిథిలా వస్థకు చేరిన కంట్రోల్‌ రూం, సబ్‌స్టేషన్‌ చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు  కాగానే మరమ్మతు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం. 

- గందె శ్రీనివాసులు, ట్రాన్స్‌కో ఏడీఈ, ఆలేరు 

Updated Date - 2021-04-19T06:16:39+05:30 IST