Abn logo
Sep 15 2021 @ 22:20PM

పొంచి ఉన్న ముప్పు..!

పాఠశాలకు వెళ్లే దారిలో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌

ఉదయగిరి రూరల్‌, సెప్టెంబరు 15: మండలంలోని కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే దారిలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రమాదకరంగా ఉంది. ప్యూజుక్యారియర్లు ధ్వంసమై చేతికందే ఎత్తులో ఉన్నాయి. దీని పక్కనే పాఠశాలకు వెళ్లే చిన్నారులకు ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు పాఠశాలకు వెళ్లే రహదారి ముళ్లకంపతో నిండి ఉండడం, పాఠశాలకు సమీపంలో వాగు ఉండడంతో విద్యార్థులకు అవస్థలు తప్పడంలేదు. ఇప్పటికైనా అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ కంచె ఏర్పాటు చేసి వాగుపై వంతెన ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.