Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘ఏపీ హైకోర్టును కర్నూలుకు బదిలీ చేయండి’

ఢిల్లీ: ఏపీ హైకోర్టును కర్నూలుకు బదిలీ చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుకి వైసీపీ ఎంపీలు విజ్ణప్తి చేశారు. దీంతోపాటుగా ఎంపీల అనర్హతకు గడువు నిర్దేశించేందుకు 10వ షెడ్యూల్‌ను సవరించాలని వినతి పత్రం ఇచ్చారు. ఎస్సీ కమిషన్ తరహాలో రాజ్యాంగ బద్ధమైన జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. నేషనల్ లా యూనివర్శిటీ, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీలను కర్నూలులో ఏర్పాటు చేయాలని వైసీపీ ఎంపీలు కోరారు. కేంద్రమంత్రికి వినతిపత్రం ఇచ్చిన ఎంపీల బృందంలో విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మోపిదేవి ఎంకటరమణ, ఆయోధ్య రామిరెడ్డి, బెల్లాన చంద్రశేఖర్‌రెడ్డి ఉన్నారు.


రాజధాని అమరావతి తరలింపు వ్యవహారం, కర్నూలులో జ్యుడీషియల్‌ రాజధాని ఏర్పాటు వంటివి హైకోర్టులో విచారణలో ఉన్నాయి. విచారణ కొనసాగుతుండగానే విజిలెన్స్‌ కమిషన్‌ ఆఫీసును అమరావతి నుంచి తరలించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు హైకోర్టు బ్రేకులు వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎక్కడివి అక్కడే కొనసాగాలని స్టేటస్‌కో ఇచ్చింది. ఇప్పుడు సర్కారు అత్యంత వ్యూహాత్మకంగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌లకు ఆఫీసులను కర్నూలులో ఏర్పాటు చేయాలనుకుంటోంది. 

Advertisement
Advertisement