Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీలో 16 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

 అమరావతి: రాష్ట్రంలో 16 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్‌ ఉత్తర్వులు జారీ చేసారు. ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ, వైస్ చైర్మన్‌గా డీ.మురళీధర్‌రెడ్డి, కడప జిల్లా కలెక్టర్‌గా విజయరామరాజును బదిలీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా చెవ్వూరి హరికిరణ్, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోగా వాడరేవు విజయచంద్‌‌ను నియమించారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా ఏ.మల్లికార్జున్‌, ఆర్‌ అండ్ ఆర్ కమిషనర్‌గా ఎం హరిజవహర్‌లాల్‌ను బదిలీ చేశారు. విజయనగరం జిల్లా కలెక్టర్‌గా సూర్యకుమారి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండిగా వీరపాండియన్, కర్నూలు కలెక్టర్‌గా పీ.కోటేశ్వరరావులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.


  వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా కే.వెంకటరమణారెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా జేసీగా సుమిత్‌కుమార్‌‌ను బదిలీ చేసింది. శ్రీకాకుళం జేసీగా బీ.ఆర్.అంబేద్కర్, చేనేత శాఖ డైరెక్టర్‌గా అర్జున్‌రావులను నియమించింది. దేవాదాయ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌కు కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. చిత్తూరు జేసీగా స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ వీసీ, ఎండీగా ప్రభాకర్‌రెడ్డిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Advertisement
Advertisement