Abn logo
Aug 1 2021 @ 23:38PM

21 మంది డిప్యూటీ తహసీల్దార్ల బదిలీ

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 1: జిల్లా వ్యాప్తంగా 21 మంది డిప్యూటీ తహసీల్దార్లను బదిలీ చేస్తూ ఆదివారం కలెక్టర్‌ హరినారాయణన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన డీటీలందరూ సోమవారంలోగా వారికి కేటాయించిన మండలాల్లో బాధ్యతలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేవీబీపురం-2లో చెక్‌పోస్టు డీటీగా పనిచేస్తున్న గీతాంజలిని పలమనేరుకు, మదనపల్లెలో ఎన్నికల డీటీగా పనిచేస్తున్న షేక్‌ రఫిక్‌ అహ్మద్‌ను పీలేరుకు, గండ్రాజుపల్లె-2లో చెక్‌పోస్టు డీటీగా పనిచేస్తున్న రెడ్డెప్పను పుంగనూరుకు, ఎంఆర్‌ కండ్రిగ-2లో చెక్‌పోస్టు డీటీగా ఉన్న సయ్యద్‌ అహ్మద్‌ను తంబళ్లపల్లెకు, రాచపల్లె-2లో చెక్‌పోస్టు డీటీగా ఉన్న షాహానాను గంగవరానికి, దాసర్లపల్లె-2లో చెక్‌పోస్టు డీటీగా ఉన్న లోకేష్‌ను కలకడకు, తంబళ్లపల్లెలో చెక్‌పోస్టు డీటీగా ఉన్న సుబ్బయ్యను కలికిరికి, రామసముద్రం తహసీల్దార్‌ కార్యాలయంలో ఉన్న దేవరాజును కుప్పానికి, రొంపిచెర్ల తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న షేక్‌ ఖజావళి మదనపల్లెకు, బడికాయలపల్లె-1లో చెక్‌పోస్టు డీటీగా ఉన్న రిషివర్మను పలమనేరుకు, మదనపల్లె తహసీల్దార్‌ కార్యాలయంలో డీటీగా ఉన్న పణికుమార్‌ను పెద్దపంజాణికి, కలికిరి తహసీల్దార్‌ కార్యాలయంలో డీటీగా ఉన్న జయసింహాను పీలేరుకు, రామసముద్రం-2లో చెక్‌పోస్టు డీటీగా ఉన్న విద్యాసాగర్‌ను రామసముద్రానికి, పీలేరు తహసీల్దార్‌ కార్యాలయంలో డీటీగా ఉన్న మురాషవళిని రొంపిచెర్లకు, రాళ్లబూదుగూరు-2లో చెక్‌పోస్టు డీటీగా ఉన్న రమేష్‌ను సదుంకు, రాచపల్లె-1లో చెక్‌పోస్టు డీటీగా ఉన్న ఫిరోజ్‌ఖాన్‌ను వాల్మీకిపురానికి, గండ్రాజుపల్లె-1లో చెక్‌పోస్టు డీటీగా ఉన్న వెంకటరెడ్డిని వీ.కోటకు, సదుం తహసీల్దార్‌ కార్యాలయంలో డీటీగా ఉన్న అన్సారీని ఎన్నికల డీటీగా కుప్పానికి, వీఆర్‌ కండ్రిగ-2లో చెక్‌పోస్టు డీటీగా ఉన్న నరసింహులును పలమనేరుకు, అనంతాపురం-1లో చెక్‌పోస్టు డీటీగా ఉన్న కిరణ్‌కుమార్‌ను పీలేరుకు, వడ్డేవాండ్లపల్లె-2లో చెక్‌పోస్టు డీటీగా ఉన్న భువనేశ్వరిదేవిని మదనపల్లెకు బదిలీ చేశారు.