Abn logo
Aug 14 2020 @ 04:51AM

పలువురు తహసీల్దార్ల బదిలీ

మంచిర్యాల, అగస్లు 13: జిల్లాలోని నలుగురు తహసీల్దార్లు, డిప్యూటీ తహ సీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్‌ భారతి హోళికేరి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జన్నారం తహసీల్దార్‌గా పనిచేస్తున్న రాజ్‌ కుమార్‌ను లక్షెట్టిపేటకు, అక్కడ పనిచేస్తున్న పుష్పలతను జన్నారం బదిలీ చేశారు. చెన్నూరు  తహసీల్దార్‌ రామచంద్రయ్యను కోటపల్లి, కోటపల్లిలో పని చేస్తున్న జ్యోతిని చెన్నూరు, కోటపల్లి నాయబ్‌ తహసీల్‌దార్‌ మున్వర్‌ షరీఫ్‌ను కన్నెపల్లి కార్యనిర్వాహక తహసీల్‌దార్‌గా బదిలీ చేశారు.

Advertisement
Advertisement