ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేయాలి : ఎంపీ

ABN , First Publish Date - 2022-01-20T04:43:51+05:30 IST

నియోజకవర్గంలో రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చే యాలని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరి హరనాథను ఎంపీ అవినాశ్‌రెడ్డి కోరారు.

ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేయాలి : ఎంపీ
అయ్యవారిపల్లెలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తున్న ఎంపీ

వేంపల్లె, జనవరి 19: నియోజకవర్గంలో రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చే యాలని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ హరి హరనాథను ఎంపీ అవినాశ్‌రెడ్డి కోరారు. అయ్యవారిపల్లెలో నిర్మించిన 33/11కెవి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిన ఎంపీ మాట్లాడుతూ వరదల్లో కొట్టుకుపో యిన ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్త వాటి ని ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడి అధికారుల వద్ద పని జరగడం లేదని, సీఎం నియోజకవర్గంలో పని జరగ కుంటే నిరసన తెలుపుతామని సీఎండీకి స్పష్టం చేశారు.

జీఎన్‌ఎస్‌ఎస్‌ కాల్వ ద్వారా చక్రా యపేట, వేంపల్లె మండలాల్లో నీటి పథకాలకు సేకరిస్తున్న భూమికి పరిహారం ఇప్పించేం దుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇటీవల వరదలకు నష్టపోయిన పం టలకు పరిహారం ఇవ్వాలని రైతు నేతలు రామచంద్రారెడ్డి, మస్తాన్‌రెడ్డి ఎంపీకి విన్న వించారు. అలిరెడ్డిపల్లె హైలెవెల్‌ బ్రిడ్జిని త్వరగా పూర్తిచేయించాలని సొసైటీ మాజీ అధ్యక్షు డు చంద్రశేఖర్‌రెడ్డి, యార్డు డైరెక్టర్‌ రామకృష్ణారెడ్డి ఎంపీని కోరారు. నందిపల్లెలో సర్పంచు మారం సులోచన, శ్రీకాంత్‌రెడ్డి సొంత, పాడా నిధులతో నిర్మించిన నూతన బస్‌షెల్టర్‌ను ఎంపీ ప్రారంభించారు.

బక్కన్నగారిపల్లెలో నూతన సచివాలయ భవనాలను, రైతు భరోసా కేంద్రాలు, మారుమూల కొండ ప్రాంతం గిడ్డంగివారిపల్లెలో జియో సెల్‌టవర్‌ను ఎంపీ ప్రారంభించారు. ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి, జడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి, ఏపీఐఐసీ డైరెక్టర్‌ చంద్రఓబుళ రెడ్డి, సర్పంచు రామగంగిరెడ్డి, ఎస్‌ఈ శ్రీని వాసులు, ఏడీఈ శ్రీకాంత్‌, సర్పంచు మల్లయ్య, గండి దేవస్థాన సభ్యురాలు మునెమ్మ, ఎంపీటీసీ వరాలు, ఎంపీపీ గాయత్రి, ఏపీఎండీసీ డైరెక్టర్‌ సల్మా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-20T04:43:51+05:30 IST