భారీ వృక్షాలకు ట్రాన్స్‌ లోకేషన్‌

ABN , First Publish Date - 2021-12-07T05:03:26+05:30 IST

కొత్తూర్‌ నుంచి షాద్‌నగర్‌ సమీపంలోని

భారీ వృక్షాలకు ట్రాన్స్‌ లోకేషన్‌
పాత జాతీయ రహదారి పక్కన ఉన్న భారీ వృక్షం తరలింపు

  • మొదటి విడతలో 39 భారీ వృక్షాల తరలింపు

కొత్తూర్‌: కొత్తూర్‌ నుంచి షాద్‌నగర్‌ సమీపంలోని సోలీపూర్‌ శివారు వరకు దాదాపు 17కిలోమీటర్ల పాత జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నారు. ఇందులోభాగంగా రహదారి పక్కన ఉన్న భారీ వృక్షాలను ట్రాన్స్‌ లోకేషన్‌ చేస్తున్నారు. వందలాది చెట్లను తొలగించాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్‌అండ్‌బీ అధికారులు రహదారి పక్కన ఉన్న చెట్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. కొత్తూర్‌ నుంచి షాద్‌నగర్‌ వరకు పాత జాతీయ రహదారి పక్కన వివిధ రకాల 732వృక్షాలు ఉన్నట్లు అధికా రులు తెలిపారు. ఇందులో 199 భారీ వృక్షాలు ట్రాన్స్‌లోకేషన్‌ (తరలింపు) చేసు కోవచ్చని గుర్తించారు. మిగతా 422 చెట్లను టెండర్‌దారులకు అప్ప గించి తొలగిస్తారు. అలాగే రహదారి పక్కనఉన్న 111చెట్లను సంరక్షిస్తారు. 199 భారీ వృక్షాలు తీసుకు వెళ్లేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తే వాటిని ఉచితంగా అప్పగిస్తామని అధికారులు పేర్కొన్నారు. శంకర్‌పల్లికి చెందిన యూనిక్‌ ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ మొదటి విడతగా 39 భారీ వృక్షాలను ట్రాన్స్‌ లోకేషన్‌ చేసేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఆ సంస్థ భారీ వృక్షాలను తరలిస్తుంది. భారీ వృక్షాల తరలిం పును ప్రజలు వింతగా తిలకించడం గమనార్హం.



Updated Date - 2021-12-07T05:03:26+05:30 IST