యాసంగిలో పంట మార్పిడి చేయండి

ABN , First Publish Date - 2021-12-06T04:32:05+05:30 IST

యాసంగిలో వరికి బదులుగా ఇతర నూనె, పప్పు గింజలు పండే పం టలను సాగు చేసుకుంటే బాగుంటుందని జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు రైతులకు సూచించారు.

యాసంగిలో పంట మార్పిడి చేయండి
రైతుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకట్రావు

 కలెక్టర్‌ వెంకట్రావు 

 రైతులకు అవగాహన


భూత్పూర్‌, డిసెంబరు 5 : యాసంగిలో వరికి బదులుగా ఇతర నూనె, పప్పు గింజలు పండే పం టలను సాగు చేసుకుంటే బాగుంటుందని జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు రైతులకు సూచించారు. భూ త్పూర్‌ మునిసిపాలిటీ పరిఽధిలోని శేరిపల్లి గ్రామం లో ఆదివారం స్థానిక ఆంజనేయస్వామి దేవాల యం ఆవరణలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహిం చారు. సమావేశానికి కలెక్టర్‌ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. రానున్న యాసంగి లో వరి కొనుగోలు కేంద్రాలు ఉండవని, రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. వరి కంటే ఆర్థిక స్వాలంబన కల్పిం చే పంటను సాగు చేస్తే ఉపయోగకరంగా ఉం టుందన్నారు. మినుము, పెసర, చిరుధాన్యాలతో పాటు, ఆయిల్‌ ఫామ్‌ తోటలను సాగు చేసుకోవా లని, మార్కెట్‌లో మంచి ధర ఉంటుందని టన్ను కు రూ.18వేలకు పైగా వస్తుందన్నారు. మహబూ బ్‌నగర్‌ జిల్లాలో ఆయిల్‌ ఫామ్‌ తోటలు సాగు చేసుకోవడానికి అనువైన భూములు ఉన్నాయని తెలిపారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తన సొంత పొలంలో ఆయిల్‌ ఫామ్‌ తోటను సాగు చేశారని, ఆసక్తి ఉన్న రైతులు దగ్గరలో ఉ న్న ఆయిల్‌ఫామ్‌ తోటను పరిశీలించాలని కలెక్టర్‌ రైతులకు సూచించారు. ఈ పంట సాగు కోసం రైతులకు అవసరమైన విత్తనాలను రాయితీలపై అందించడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌, వార్డు కౌన్సిలర్‌ శ్రీనివాస్‌రెడ్డి, మా జీ జడ్పీటీసీ చంద్రమౌళి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్య క్షుడు సురేష్‌కుమార్‌గౌడ్‌, ఏవో మురళీధర్‌, ఏఈ వో హర్షవర్ధన్‌, రైతులు అశోక్‌గౌడ్‌, రమాకాంత రావు, బోరింగ్‌ నర్సిములు, ర్యాషన్‌ యాదగిరి, మ హిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-06T04:32:05+05:30 IST