దూరప్రాంత సరుకు రవాణా కోసం ఆర్టీసీ లాజిస్టిక్స్‌ ప్రత్యేక కార్గో సర్వీసులు

ABN , First Publish Date - 2021-05-08T06:30:51+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ కారణంగా ఆర్టీసీ దూరప్రాంత సర్వీసులన్నీ రద్దయిన పరిస్థితుల్లో దూరప్రాంత సరుకు రవాణా కోసం ఏపీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ ప్రత్యేక కార్గో డిపో గూడ్స్‌ ట్రాన్స్‌పోర్టు (డీజీటీ) వాహనాలు నడపుతున్నామని ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ ఆర్‌వీఎస్‌ నాగేశ్వరరావు తెలిపారు.

దూరప్రాంత సరుకు రవాణా కోసం  ఆర్టీసీ లాజిస్టిక్స్‌ ప్రత్యేక కార్గో సర్వీసులు

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 7: రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ కారణంగా ఆర్టీసీ దూరప్రాంత సర్వీసులన్నీ రద్దయిన పరిస్థితుల్లో దూరప్రాంత సరుకు రవాణా కోసం ఏపీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ ప్రత్యేక కార్గో డిపో గూడ్స్‌ ట్రాన్స్‌పోర్టు (డీజీటీ) వాహనాలు నడపుతున్నామని ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ ఆర్‌వీఎస్‌ నాగేశ్వరరావు తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు రాజమహేంద్రవరం నుంచి రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ మీదుగా హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌, జేఎన్‌టీయూ, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈఎబీ వరకూ డీజీటీ వాహనాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే విశాఖపట్నానికి మధ్యాహ్నం 12 గంటలకు, విజయవాడ, గుంటూరులకు మధ్యాహ్నం 2 గం టలకు ప్రతిరోజూ డీజీటీలను నడుపుతామన్నారు. ప్రత్యేకించి ఈ కారిడార్లోని డీజీటీలకు అనుసంధానంగా విజయవాడ నుంచి తిరుపతి, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, కడపలకు డీజీటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సరుకులను ఆయా ప్రాంతాలకు సురక్షితంగా చేరే ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఏ డిపోకైనా సరుకులు చేర్చడం జరుగుతుందని, అయితే కొంత ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. దీంతోపాటు 10 టన్నుల వరకూ సరుకును వారి గమ్యస్థానాలకు చేర్చడానికి జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, రాజోలు, రావులపాలెం, రామచంద్రపురం, ఏలేశ్వరం, గోకవరం డిపోల్లో అదనపు డీజీటీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వివరాల కోసం సంబంధిత డిపో మేనేజరును లేదా ఏటీఎం (కమర్షియల్‌) సెల్‌ 7331147262 నెంబరులో సంప్రదించాలని కోరారు. ఈ లాజిస్టిక్స్‌ రవాణా సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని రీజనల్‌ మేనేజర్‌ కోరారు. 

Updated Date - 2021-05-08T06:30:51+05:30 IST