చెల్లికి న్యాయం కోసం మళ్లీ ఢిల్లీ యాత్ర

ABN , First Publish Date - 2022-06-17T08:30:59+05:30 IST

చెల్లికి న్యాయం కోసం మళ్లీ ఢిల్లీ యాత్ర

చెల్లికి న్యాయం కోసం మళ్లీ ఢిల్లీ యాత్ర

రిక్షాపై యాత్ర.. అడ్డుకున్న పోలీసులు

చందర్లపాడు, జూన్‌ 16: వైవాహిక జీవితంలో అన్యాయానికి గురైన తన సోదరికి న్యాయం చేయాలని కోరుతూ మన్నేపల్లి నాగదుర్గారావు రిక్షాపై మరోమారు ఢిల్లీకి పయనమయ్యాడు. అయితే పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపేశా రు. మండలంలోని ముప్పాళ్లకు చెందిన నవ్యత అనే యువతికి నందిగామ మండలం చందాపురాకి చెందిన కొంగర నరేంద్రతో వివాహమైంది. కొన్నాళ్లకు గొడవలు వచ్చాయి. విడాకులకు సిద్ధపడ్డారు. పెళ్లి సమయంలో ఇచ్చిన రూ.21 లక్షలు తిరిగివ్వాలని నవ్య తరపు పెద్దమనుషులు కోరడంతో రూ.15 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం సొమ్ము ఇవ్వకపోగా కుమారుడి మగతనంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నవ్యత కుటుంబ సభ్యులపై పరువునష్టం దావా వేశారు. దీంతో నవ్యత సోదరుడు నాగదుర్గారావు తన సోదరికి న్యాయం చేయాలని కోరుతూ అధికారుల చుట్టూ తిరిగాడు. ఫలితం లేక గత మే నెలలో తల్లిదండ్రులతో కలిసి మండుటెండలో కృష్ణానది ఇసుక తిన్నెలపై దీక్ష చేపట్టాడు. పోలీసులు, బలవంతంగా దీక్ష విరమింపజేశారు. తరువాత పట్టించుకోకపోవడంతో రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు ఫిర్యాదు చేసేందుకు ఎడ్ల బండిపై నాగదుర్గారావు ఢిల్లీ యాత్ర చేపట్టాడు. మే 28న వరంగల్‌ జిల్లా చందర్లపాడు పోలీసులు అడ్డుకొని కలెక్టర్‌ న్యాయం చేస్తారని చెప్పారు. తర్వాత కూడా పట్టించుకోకపోవటంతో ఎక్కడైతే యాత్రను ఆపాడో అక్కడ నుంచే యాత్ర ప్రారంభించాడు. ఈ సారి ఎద్దుల బండిపై కాకుండా రిక్షాపై యాత్ర ప్రారంభించాడు.  

Updated Date - 2022-06-17T08:30:59+05:30 IST