ప్రభుత్వ బీమాతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స

ABN , First Publish Date - 2020-06-05T16:57:55+05:30 IST

ప్రభుత్వ బీమాతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స

ప్రభుత్వ బీమాతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స

చెన్నై(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బీమా పథకం కింద ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా బాధితులు చికిత్స చేయించుకోవచ్చని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసినట్టు ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌ తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్య పరీక్షలకు, చికిత్సలకు లక్షలాది రూపాయలను ఫీజులుగా వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బీమా పథకం కార్డులు (ముఖ్యమంత్రి భీమా కార్డులున్నవారు) ప్రైవేటు ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్స పొందవచ్చని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులు ప్రభుత్వ బీమా కార్డులను ఆమోదించి కరోనా బాధితులకు చికిత్సలందించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి విజయభాస్కర్‌ తెలిపారు.

Updated Date - 2020-06-05T16:57:55+05:30 IST