రోడ్డును కప్పేస్తున్న కంపచెట్లు

ABN , First Publish Date - 2021-06-22T06:20:53+05:30 IST

మండలంలోని కరిగానపల్లి ఎస్సీకాలనీకి వెళ్లే రోడ్డును గుబురుగా పెరిగిన కంపచెట్లు కప్పేస్తున్నాయి.

రోడ్డును కప్పేస్తున్న కంపచెట్లు
కరిగానపల్లి ఎస్సీకాలనీలో రోడ్డుపక్కనే గుబురుగా పెరిగిన కంపచెట్లు

విష పురుగుల భయంతో ఎస్పీ కాలనీ వాసుల ఆందోళన


కుందుర్పి, జూన 21: మండలంలోని కరిగానపల్లి ఎస్సీకాలనీకి వెళ్లే రోడ్డును గుబురుగా పెరిగిన కంపచెట్లు కప్పేస్తున్నాయి. మరోవైపు జనావాసాల చెందనే ఉన్న ఈ ముళ్లపొదల్లో నుంచి విషపురుగులు ఇళ్లల్లోకి వస్తున్నాయని కాలనీవాసులు భయాందోళన వ్య క్తం చేస్తున్నారు. ఖాళీస్థలంలో కంపచెట్లు ఏపుగా పెరగడంతో పాములకు ఆవాసాలుగా మారుతున్నాయి. మరోవైపు దారికి కూ డా సగానికిపైగా అల్లుకున్నాయి. ఈరోడ్డుపై ప్రయాణించాలంటే గ్రామస్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక రాత్రి సమయంలో అయితే ఆదారిన వెళ్లాలంటే భయపడుతున్నారు. వచ్చేది వర్షాకాలం సీజన కావడంతో ఈ కంపచెట్లు మరింత గుబురుగా అల్లుకుంటాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంపచెట్లను తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Updated Date - 2021-06-22T06:20:53+05:30 IST