వణుకుతున్న రామగుండం...

ABN , First Publish Date - 2022-01-29T05:28:27+05:30 IST

రామగుండం పారిశ్రామిక ప్రాంతం చలి పంజా విసురుతోంది.

వణుకుతున్న రామగుండం...
రోడ్డుపై చలిమంటలు కాగుతున్న దృశ్యం


10డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

కళ్యాణ్‌నగర్‌, జనవరి 28: రామగుండం పారిశ్రామిక ప్రాంతం చలి పంజా విసురుతోంది. గురువారం రాత్రి పూట ఉష్ణోగ్రతలు 10.4డిగ్రీలకు పోయాయి. శుక్రవారం సాయంత్రం నుంచే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇది సాధారణ ఉష్ణోగ్రతలకు ఆరు డిగ్రీలు తక్కువ. దీంతో పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఉన్ని దుస్తులను ఆశ్రయిస్తున్నారు. చాలా చోట్ల ప్రజలు చలిమంటలతో సేదతీరుతున్నారు. సాయంత్ర 7గంటలకు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతాలు, వ్యాపార కూడళ్లు నిర్మానుశ్యంగా మారుతున్నాయి. రాత్రి పూట సింగరేణి విధులకు హాజరయ్యే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లవారుజామున పాలు, కూరగాయలు తీసుకువచ్చే వారు చలితో ఇబ్బందులు పడుతున్నారు. పగటి పూట ఉష్ణోగ్రతలు సైతం 27డిగ్రీలు నమోదు అవుతున్నాయి. ఇది సాధారణ ఉష్ణోగ్రతలకు నాలుగు డిగ్రీలు తక్కువ.


Updated Date - 2022-01-29T05:28:27+05:30 IST