Abn logo
Sep 24 2021 @ 16:38PM

అక్రమ కస్టడీపై హైకోర్టులో విచారణ

అమరావతి: అక్రమ కస్టడీ విషయంలో నమోదైన హెబియస్ కార్పస్ పిటిషన్’పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఓ కేసులో పోలీసులు అన్యాయంగా తమను అరెస్ట్ చేశారని ఇద్దరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. తమను పోలీసులు ఇల్లీగల్ కస్టడీకి తీసుకున్నారంటూ హైకోర్టులో అక్తర్ రోషన్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ కేసులో వాస్తవాలను హైకోర్టుకు లా అండ్ ఆర్డర్ ఏడీజీ తెలిపారు. ఏడీజీ  రిపోర్ట్ ఆధారంగా పోలీసులు చర్యలు తీసుకున్నారని అడ్వకేట్ జనరల్ తెలిపారు. రిపోర్ట్‌ను అడ్వకేట్ జనరల్‌కు అందించాలని హైకోర్టు సూచించింది.


చాలా కేసుల్లో పోలీసులు ఇల్లీగల్ కస్టడీకి తీసుకుంటారని,  పదే పదే హెబియస్ కార్పస్ పిటిషన్స్ ధాఖలు అవుతున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది చాలా విచారకరమని ధర్మాసనం పేర్కొంది. కోర్టు దాకా రాకుండా సక్రమంగా విచారణ జరపాలని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో ఉద్దేశ్యపూర్వకంగానే హెబియస్ కార్పస్ పిటిషన్స్ ధాఖలు చేస్తున్నారని ఏజీ పేర్కొన్నారు. ఇల్లీగల్ కస్టడీకి తీసుకోకుండా సిబ్బందికి ఉన్నతాధికారులు సూచనలను ఇవ్వాలని హైకోర్టు సూచించింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని ఏజీ  తెలిపారు. అరెస్ట్ చేసిన ఇద్దరిని  కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి మెడికల్ రిపోర్ట్స్ హైకోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి ధర్మాసనం వాయిదా వేసింది. 

ఇవి కూడా చదవండిImage Caption