ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-08-09T19:54:10+05:30 IST

పశ్చిమగోదావరి: జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే

కోట రామచంద్రపురం: పశ్చిమగోదావరి జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఐటీడీఏ పీఓ ఓ.ఆనంద్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ శ్రీమతి ప్రసన్న లక్ష్మి, పోలవరం డీఎస్పీ శ్రీమతి లతా కుమారి, ఆదివాసి సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ ఆదివాసీయుల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలుగా కట్టుబడి ఉందన్నారు. గిరిజనుల సంక్షేమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కూడా అనుక్షణం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారని కొనియాడారు.


ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ ఇక్కడ తాను చదువుకున్న విద్యాసంస్థ (ఐటీడీఏ వద్ద నున్న ఏపీ ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాల మరియు జూనియర్ కళాశాల) అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.


అనంతరం ఎమ్మెల్యే బాలరాజు ద్వారా ''నాడు నేడు'' పథకం కింద రూ.51.68 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ విద్యాసంస్థ ప్రహరీని ప్రారంభించి, వనమహోత్సవంలో భాగంగా ఆవరణలో మొక్కలు నాటారు. తరువాత ఎమ్మెల్యే, కలెక్టర్ తదితరులు ఆదివాసీయుల గిరి నృత్యంలో పాల్గొన్నారు. జాతీయజెండా, ఆదివాసీ జెండాలను ఆవిష్కరించారు.



Updated Date - 2021-08-09T19:54:10+05:30 IST