Abn logo
Apr 20 2021 @ 23:27PM

ఆదివాసీ సంస్క ృతిని భావితరాలకు అందించాలి

ఇంద్రవెల్లి, ఏప్రిల్‌ 20: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ముందుగా ముత్నూర్‌ గ్రామంలో కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేస్లాపూర్‌ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మెస్రం వంశీయులు ఆధ్వర్యంలో శాలువతో సన్మానించి నాగోబా చిత్రపటాన్ని అందజేశారు. నాగోబా జాతర, నాగోబా చరిత్రను మెస్రం వంశీయులు వివరించారు. ఈ కార్యక్రమంలో నాగోబా పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు, గ్రామ సర్పంచ్‌ మెస్రం రేణుకానాగనాథ్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ మెస్రం ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement