ఆదివాసీ గ్రామాలు అంధకారంలోనే!

ABN , First Publish Date - 2022-08-22T05:07:14+05:30 IST

జిల్లాలోని పలు ఆదివాసీ గ్రామాలు దశాబ్దాల కాలం నుంచి కరెంటు సౌకర్యానికి నోచుకోవడం లేదు. ముఖ్యంగా కవ్వాల్‌ అభయారణ్యం పరిధిలోని పలు గ్రామాలు ఇప్పటి వరకు కరెంటును కళ్లతోని చూడలేదంటే అతిశయోక్తి కాదు.

ఆదివాసీ గ్రామాలు అంధకారంలోనే!
పెంబి మండలం చాకిరేవు గ్రామంలో దీపం వెలుగులో భోజనం చేస్తున్న దృశ్యం

చీకట్లోనే మగ్గుతున్న మారుమూల గ్రామాలు 

కాగితాలకే పరిమితమవుతున్న  ప్రతిపాదనలు 

అడ్డొస్తున్న అటవీ శాఖ నిబంధనలు 

అవస్థల్లో ఆదివాసీలు 

నిర్మల్‌, ఆగస్టు 21 ( ఆంధ్రజ్యోతి ) : జిల్లాలోని పలు ఆదివాసీ గ్రామాలు దశాబ్దాల కాలం నుంచి కరెంటు సౌకర్యానికి నోచుకోవడం లేదు. ముఖ్యంగా కవ్వాల్‌ అభయారణ్యం పరిధిలోని పలు గ్రామాలు ఇప్పటి వరకు కరెంటును కళ్లతోని చూడలేదంటే అతిశయోక్తి కాదు. ప్ర భుత్వం మారుమూల పల్లెలకు అన్ని రకాల సౌకర్యాలు క ల్పిస్తున్నామంటూ చేస్తున్న ప్రకటనలకు ఇక్కడి ఆదివాసీ పల్లెల పరిస్థితికి పొంతన ఉండడం లేదన్నది బహిరంగ రహస్యమే. జిల్లాలోని పెంబి, కడెం మండలాల్లో గల పలు గ్రామాలు కరెంటు సౌకర్యం లేక అంధకారంలోనే మగ్గుతున్నాయి. మరికొన్ని గ్రామాలకు త్రీఫేజ్‌ కరెంటు సౌకర్యం లేకపోవడం ఆ పల్లె వాసులను ఇబ్బందుల పా లు చేస్తోంది. త్రీఫేజ్‌ సౌకర్యం లేని కారణంగా పంటలకు సాగునీరును అందించలేకపోతున్నామంటున్నారు. జిల్లా వ్యాప్తం గా మొత్తం ఆరు గ్రామాలు పూర్తిగా కరెంటు సౌకర్యం లేని గ్రామాలుగా అధికారులు నిర్ధారించారు. అలాగే మరో 36 గ్రామాలకు త్రీఫేజ్‌ సౌకర్యం లేనట్లు అధికారులు నిర్ధారిస్తున్నారు. అయితే కవ్వాల్‌ టైగర్‌ రిజ ర్వ్‌ పరిధిలో ఈ గ్రామాలు ఉన్న కారణం గా కరెంటు సౌ కర్యం కల్పించలేని పరిస్థితి నెలకొంటుందంటున్నారు. 2005 సంవత్సరం తరువాత ఈ అభ యారణ్యం పరిధిలో ని గ్రామాల్లో తవ్వకాలు, విద్యుత్‌ స్తంభాల ఏర్పా టు లాంటి పనులు చేపట్టడం పూర్తి గా నిషేధం. ఇలాంటి ప నులకు అటవీ శాఖ నుంచి అనుమతులు తప్పనిసరి. అ యితే కవ్వాల్‌ రిజర్వ్‌ నిబంధనల ప్రకారం అనుమతు లు సాధ్యం కావడం లేదంటున్నారు.అయినప్పటికీ వి ద్యుత్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు ఈ గ్రామాల్లో ఫోల్స్‌, విద్యుత్‌ లైన్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ప్రభు త్వం ఈ ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నప్పటికీ అట వీ, పర్యావరణ శాఖ ద్వారా గ్రీన్‌ సిగ్న ల్‌ జారీ కావడం లేదు. అయి తే కొన్ని గ్రామాల్లో గత్యంతరం లేక సోలార్‌ విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇటీవల ఈ పరిధిలోని పలు మారుమూల గ్రామాలను కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ పేరిట ఇతర ప్రాం తాలకు తరలించి అక్కడ పునరావాసం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన సం గతి తెలిసిందే. ఇవే కాకుండా ప్ర స్తుతం ఉన్న గ్రామాలకు అధికారులు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పించలేని పరిస్థితులున్నాయంటున్నా రు. కొద్ది రోజుల క్రితం చాకిరేవు అనే ఆదివాసీ గ్రామ ప్రజలు కరెంటుతో పాటు రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. వారంతా చాకిరేవు గ్రామం నుంచి నిర్మల్‌ వరకు పాదయాత్ర చేసి ఇక్కడి కలెక్టరేట్‌ ముందు రిలే దీక్షలు కొనసాగించారు. ఆదివాసీలు యేళ్ల నుంచి కరెంటు కోసం ఆందోళనలు చేస్తున్నప్పటికీ వారి గోడు అరణ్య రోధనగానే మారిందంటున్నారు. 

చీకట్లోనే పల్లెలు..

పెంబి మండలం దొంధరి గ్రామ పంచాయతీ పరిధిలో గల సాకెర, పోచంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడ, పెద్ద రాగిదుబ్బ, కడెం మండలం ఉడుంపూర్‌ పంచాయతీ పరిధిలోని మిద్దచింత, రాంపూర్‌, అలంపెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ధర్మాజీపేట గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఈ గ్రామాలు ఏర్పడిన నాటి నుంచి కరెంటు కోసం గంతెత్తి నినధిస్తున్నప్పటికీ అధికారుల నుం చి స్పందన కనిపించడం లేదంటున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నప్పటికీ టైగర్‌ జోన్‌ నిబంధనల ప్రకారం సంబంధిత అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. వీటితో పాటు మరో 36 గ్రామాలకు కూడా త్రీఫేజ్‌ సౌకర్యం కల్పించలేకపోతున్నారు. 

ఉద్యమబాటలో ఆదివాసీలు..

ఇదిలా ఉండగా కరెంటు సమస్యపైనే కాకుండా రోడ్లు, తా గునీటి సౌకర్యం కల్పించాలంటూ ఆదివాసులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. కొద్ది రోజుల క్రితం చాకిరేవు గ్రామానికి చెందిన ఆదివాసీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. మిగతా గ్రామాలు కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నాయి. పూర్తిగా కరెంటు లేని గ్రామాలతో పాటు త్రీఫేజ్‌ కోసం డిమాండ్‌ చేస్తున్న 36 గ్రామాల ప్రజలు నిరసనకు దిగేందుకు సిద్ధమవుతున్నారు. దీని కోసం గానూ ఇటీవలే వీరంతా సమావేశమై ఉద్యమ కార్యచరణను కూడా రూపొందించుకున్నారని సమాచారం. మొదట మండల స్థాయిలోనూ ఆ తరువాత జిల్లా స్థాయిలో ఆందోళనలను తీవ్రం చేయాలని ఆదివాసీలు నిర్ణయించుకున్నారు. 

హామీలకే పరిమితం..

కాగా ఆదివాసీ గ్రామాలకు పూర్తిస్థాయిలో కరెంటు, రోడ్డు సౌకర్యం కల్పిస్తామంటూ రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు ఇస్తున్న హామీలన్నీ బుట్టదాఖలవుతున్నాయంటున్నారు. ప్రతి ఎన్నికల సమయంలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఆ పార్టీలో ప్రాతినిఽథ్యం వహించే నాయకులు తామంటే తాము కరెంటు సౌకర్యం కల్పిస్తామంటూ హామీల వర్షం కురిపిస్తుండడం సహజమైందంటున్నారు. మళ్లీ ఎన్నికల తరువాత ఏ ఒక్క నాయకుడు సైతం ఈ గ్రామాల వైపు కన్నెత్తి చూడని పరిస్థితులున్నాయని ఆ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం తమను ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంటున్నారే తప్పా ఏ ఒక్కరూ తమ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయడం లేదని వాపోతున్నారు. రాబోయే ఎన్నికల వరకైనా తమ సమస్య పరిష్కారం కానట్లయితే ఏ ఒక్క నాయకున్ని తమ గ్రామంలోకి రానివ్వబోమంటూ గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. 

కరెంటు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ..

- నిర్మల, చాకిరేవు గ్రామం 

మారుమూల గ్రా మమైన మా చాకిరేవు గ్రామంలో యేళ్ల తరబడిగా కరెంటు సౌకర్యానికి మేము నోచుకోవడం లేదు. దీంతో నిత్యం చీకట్లోనే మమేకమై జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల మా గ్రామం నుంచి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు పాదయాత్ర సైతం చేశాము. అయినప్పటికి మా గ్రామానికి కరెంటు సౌకర్యం కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. మాకు కరెంటు లేక రాత్రివేళల్లో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. కావున అధికారులు స్పందించి చాకిరేవు గ్రామానికి కరెంటు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం. 


Updated Date - 2022-08-22T05:07:14+05:30 IST