బుగ్గ పుణ్యక్షేత్రంలో ఆదివాసీల జలాభిషేక పూజలు

ABN , First Publish Date - 2022-01-19T04:18:59+05:30 IST

సిర్పూర్‌(యూ) మండలం ఆలీగూడ అటవీ సరిహద్దు ప్రాంతంలో గల బుగ్గ పుణ్యక్షేత్రంలో మంగళవారం ఆదివాసీలు తమ కులదైవాలకు జలాభిషేకం నిర్వహించారు.

బుగ్గ పుణ్యక్షేత్రంలో ఆదివాసీల జలాభిషేక పూజలు
కుమరం భీం జిల్లా సిర్పూర్‌(యూ) మండలంలోని బుగ్గ పుణ్యక్షేత్రంలో జలాభిషేకం నిర్వహిస్తున్న ఆదివాసీలు

సిర్పూర్‌(యూ), జనవరి 18: సిర్పూర్‌(యూ) మండలం ఆలీగూడ అటవీ సరిహద్దు ప్రాంతంలో గల బుగ్గ పుణ్యక్షేత్రంలో మంగళవారం ఆదివాసీలు తమ కులదైవాలకు జలాభిషేకం నిర్వహించారు. అనం తరం అటవీ ప్రాంతంలోనే వంటలు చేసుకుని సంహపంక్తి భోజనం చేశారు. యేటా పుష్యమాసం సందర్భంగా ఆదివాసీలు కుటుంబ సమేతంగా ఈ పుణ్యక్షేత్రానికి తరలివచ్చి జలాభిషేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సోమవారం పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి కావడంతో రెండు రోజులుగా ఆదివాసీలు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావు, ఆత్రం లింబారావు, ఆత్రం శ్రీరావ, ఆత్రం బల్వంత్‌రావు, కనక మాన్కు, కనక జంగు, ఆత్రం కుసుంరావు, ఆత్రం ఆనంద్‌రావు దుర్వ మోతిరాం పాల్గొనారు.

Updated Date - 2022-01-19T04:18:59+05:30 IST