బాలుకు సంగీత నీరాజనం

ABN , First Publish Date - 2021-10-15T05:50:49+05:30 IST

ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్థంతి సందర్భంగా గురువారం నగరంలోని ఆయన సొంత ఇంట్లో సంగీత నీరాజనం జరిగింది.

బాలుకు సంగీత నీరాజనం
స్వర నీరాజనంలో కళాకారులు

నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి) అక్టోబరు 14 : ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్థంతి సందర్భంగా గురువారం నగరంలోని ఆయన సొంత ఇంట్లో సంగీత నీరాజనం జరిగింది. ద్రావిడ సంప్రదాయ తిథుల ప్రకారం,  కంచికామకోటి పీఠాధిపతులు శ్రీవిజయేంద్ర సరస్వతీ స్వామి కోరిక మేరకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్థంతిని నిర్వహించారు. బిక్షాటన పూర్వక శ్రీత్యాగరాజ స్మరణోత్సవ సభ బృందం సభ్యులు బాలార్క శిష్యులచే శాస్త్రీయ సంగీత నీరాజనం జరిగింది. నెల్లూరులోని బాలు ఇంటిని కంచి కామకోటి పీఠానికి అందజేసిన విషయం తెలిసిందే. ఆ ఇంటిలో ప్రస్తుతం వేదం- నాదం పాఠశాలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో బాలార్క ఆర్‌.గోపాలకృష్ణపాయ్‌, పి.వైష్ణవి, సావిత్రిపాయ్‌, ప్రియాకామత్‌, పార్వతిపాయ్‌, రాణి కామత్‌, బీవీకే వైష్ణవి, బీవీకే వాగ్దేవి, అచ్యుత్‌ భట్‌లు సంగీత నీరాజనంలో పాల్గొన్నారు. పి.వనజ, వేదవ్యాస్‌ పాయ్‌లు వయోలినిస్ట్‌, ఎం.శివకుమార్‌, ఆర్‌ఎం ఈశ్వర్‌పాయ్‌లు మృదంగం, కంజీరాలు అందించారు.

Updated Date - 2021-10-15T05:50:49+05:30 IST