Abn logo
Sep 26 2021 @ 23:23PM

జాషువా, భీమన్న జాతీయవాదులు

జాషువా, భీమన్నకు నివాళి అర్పిస్తున్న నిర్వాహకులు

నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి), సెప్టెంబరు 26 : సమాజంలో వర్గ సంఘర్షణను రూపుమాపేందుకు, జాతీయతత్వం పెంపొందించేందుకు కృషి చేసిన మహోన్నత సాహితీమూర్తులు గుర్రం జాషువా, బోయి భీమన్న అని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పరశురామ్‌ కొనియాడారు. సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్‌ హాల్‌ రూంలో జాషువా, భీమన్న జయంతి కార్యక్రమం నిర్వహించారు. పరశురామ్‌ మాట్లాడుతూ అంటరానితనానికి వ్యతిరేకంగా, సమసమాజ నిర్మాణానికి  జాషువా, భీమన్న కృషి చేశారన్నారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో వెల్లివిరిసిన మానవ త్వం అనే అంశంపై కవితలు, పాటలు, పద్యాల పోటీ నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. సమరసతా వేదిక అధ్యక్షుడు ఎన్‌ శ్రీధర్‌, ఎం చంద్రశేఖ ర్‌, గోళ్ల కేశవ్‌, కోడూరి సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.