‘పూలే ఆశయాలను కొనసాగించాలి’

ABN , First Publish Date - 2021-11-29T05:09:05+05:30 IST

మహాత్మా జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషి ఎంతో గొప్పదని, ఆ మహానీయుడు అందించిన స్ఫూర్తితోనే ఈరోజు బలహీనవర్గాల వారు రాజకీయ, ఆర్థిక తదితర రంగాల్లో ఎంతో ముందుకు వెళ్తున్నారనీ టీడీపీ వివిధ విభాగాల నాయకులు అన్నారు.

‘పూలే ఆశయాలను కొనసాగించాలి’
కర్నూలు: నివాళి అర్పిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 28: మహాత్మా జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషి ఎంతో గొప్పదని, ఆ మహానీయుడు అందించిన స్ఫూర్తితోనే ఈరోజు బలహీనవర్గాల వారు రాజకీయ, ఆర్థిక తదితర రంగాల్లో ఎంతో ముందుకు వెళ్తున్నారనీ టీడీపీ వివిధ విభాగాల నాయకులు అన్నారు. ఆదివారం టీడీపీ ఆధ్వర్యంలో ఆ మహానీయుని వర్ధంతి ఘనంగా కర్నూలు నగరంలో నిర్వహించారు. బిర్లాగేటు ఎదురుగా ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. టీడీపీ నాయకులు సత్యనారాయణ చౌదరి, ఎల్లయ్య తదితరులు మాట్లాడుతూ ఆటవిక రాజ్యం ఏలుతున్న రోజుల్లో జ్యోతిరావుపూలే సమాజసేవ నా ధ్యేయం, సమసమాజ స్థాపన తన ఆశయమని ప్రకటించి జ్యోతిరావుపూలే ఆయన సతీమణి సావిత్రీబాయిపూలే బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం సొంతంగా పాఠశాలలను నిర్వహించి, ఉచితంగా విద్యను అందించారని తెలిపారు. అంటరానితనం, అస్పృశ్యత  రూపుమాపడం కోసం ధైర్యంగా ఆనాడే ముందుండి సంఘ దురాచారాలను ఎదుర్కొన్నారని, అటువంటి మహానీయుల అడుగు జాడల్లో నడిచి పేదల అభివృద్ది కోసం కృషి చేయాలని సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి పిలుపునిచ్చారు.  


కర్నూలు(ఎడ్యుకేషన్‌): మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించేలా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యం కోరారు. కల్లూరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి సత్యంతో పాటు కల్లూరు కార్యదర్శి చిరంజీవి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మద్దిలేటి, చిన్న మద్దయ్య, అన్నయ్య, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


బహుజనల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు రామశేషయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆనంద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి అన్నారు. పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బయ్యన్న, కమల్‌ సాబ్‌ తదితరులు, పాల్గొన్నారు.


కర్నూలు(న్యూసిటీ): జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమానికి వేడులకు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ హజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. 


కర్నూలు(అర్బన్‌): అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని కర్నూలు నగర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు జాన్‌ విల్సన్‌ అన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయంలో పూలే 131వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ సామాజిక కార్యకర్తగా, మేధావిగా, కుల వ్యతిరేక సామాజిక సంస్కర్తగా, రచయితగా, కులంపేరుతో తరతరాలుగా, అన్ని రకాలుగా అణచివేతకు గురైన బడుగు, బలహిన వర్గాలకు అండగ నిలిచిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు బ్రతుకన్న, డీసీసీ కార్యదర్శులు అభినాయుడు, ఉస్తాద్‌ అహమ్మద్‌, బివీ. సుబ్రమణ్యం, కేశవరెడ్డి, శివానంద్‌, ఎల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.


 బహుజన  మహిళలకు జ్యోతిరావు పూలే అండగా నిలిచారని మహిళా ఐక్యవేదిక వ్యస్థాపకురాలు పట్నం రాజేశ్వరీ అన్నారు. ఆదివారం నగరంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హక్కుల ఐక్యవేదిక కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి నగర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి ఆధ్యక్షతన వర్థంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఆదర్శంగా నిలిచి చూపించన మహనీయుడన్నారు. తన భార్య సాయిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి ఆమె ద్వారా బాలికలకు, మహిళలకు విద్యను నేర్పించార న్నారు. ఆమె మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సమాజంలో చెరగని స్థానాన్ని కల్పించిన మహనీయురాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాళ్లు వడ్డే సరస్వతి, ఎర్రం లక్ష్మిదేవీ, శార, ఉప్పరి సరస్వతి, విజయ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-11-29T05:09:05+05:30 IST