సావిత్రి బాయి ఫూలేకు నివాళి

ABN , First Publish Date - 2022-03-11T05:39:29+05:30 IST

సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

సావిత్రి బాయి ఫూలేకు నివాళి
మరికల్‌లో సావిత్రిబాయి చిత్రటం వద్ద నివాళి అర్పిస్తున్న బీఎస్పీ నాయకులు

నారాయణపేట టౌన్‌, మార్చి 10 : సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా ఉపా ధ్యక్షుడు గౌస్‌ మాట్లాడుతూ సావిత్రి బాయి ఫూలే జయంతిని మహిళా దినోత్స వంగా ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో అనిల్‌, గణేష్‌, సంతోష్‌, వెంకటేష్‌, శిరీష, నవిత, శారద, మహేశ్వరి, జ్యోతి పాల్గొన్నారు.

మక్తల్‌ : భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి ఫూలే వర్ధంతి సందర్భంగా పట్టణంలోని అమ్మ స్మారక గ్రంథాలయం వద్ద ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రజా సంఘాల నాయకుడు బండారి వెంకటేష్‌ మాట్లాడుతూ సావిత్రి బాయి ఫూలే సంఘ సంస్కర్తగా, ఉపాధ్యాయురాలిగా రచయిత్రిగా బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప మహనీయురాలన్నారు. కార్యక్రమంలో అంబేడ్కర్‌ సంఘం నాయ కులు పోలప్ప, దత్తాత్రేయ, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా నాయకుడు లింగన్న, పీడీఎస్‌యూ నాయకులు భాస్కర్‌, అజయ్‌, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు పాల్గొన్నారు. 

మరికల్‌ : మండల కేంద్రంలో బీఎస్పీ నారాయణపేట నియోజకవర్గ ఇన్‌చార్జి బొదిగెల శ్రీనివాసులు ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మహిళ విద్యకు పెద్దపీట వేస్తూ, అట్టడుగు వర్గాలకు చెందిన స్ర్తీలు చదువుకునేందుకు ఆమె పాఠశాలలు సైతం ప్రారంభించారన్నారు. కార్యక్రమం లో చంద్రయ్య, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-03-11T05:39:29+05:30 IST