251 సార్లు రక్తదానం చేసిన సంపతకుమార్‌కు సన్మానం

ABN , First Publish Date - 2022-01-24T05:46:40+05:30 IST

251 సార్లు రక్తదానం, ప్లాస్మాదానం చేసిన దాత డాక్టర్‌ సంపతకుమార్‌ను జిల్లా రెడ్‌క్రాస్‌, ఎన్జీ కళాశాల వాకర్స్‌ అసోసియేషన, నల్లగొండ క్ల బ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు.

251 సార్లు రక్తదానం చేసిన సంపతకుమార్‌కు సన్మానం
రక్తదాతను సన్మానిస్తున్న డీఎస్పీ, రెడ్‌క్రాస్‌ ప్రతినిధులు

నల్లగొండ క్రైం, జనవరి 23: 251 సార్లు రక్తదానం, ప్లాస్మాదానం చేసిన దాత డాక్టర్‌ సంపతకుమార్‌ను జిల్లా రెడ్‌క్రాస్‌, ఎన్జీ కళాశాల వాకర్స్‌ అసోసియేషన, నల్లగొండ క్ల బ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. రెడ్‌క్రాస్‌ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీఎ స్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా రెడ్‌క్రాస్‌ చైర్మన అమరేందర్‌రెడ్డి సంపతకుమార్‌ను పూలమాల, శాలువాలతో ఘనంగా సన్మానించారు. యువత డాక్టర్‌ సంపతకుమార్‌ను ఆదర్శంగా తీసుకుని రక్తదానం చేసేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకు లు చింతపల్లి వెంకన్న, గోనారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాస్‌, మహేందర్‌రె డ్డి, రెహమాన, సుధాకర్‌రెడ్డి, ముత్యంరెడ్డి, సురే్‌ష, సరస్వతి, ఈశ్వరయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-24T05:46:40+05:30 IST