Advertisement
Advertisement
Abn logo
Advertisement

యువతకు ఆదర్శం పూలే

తణుకు, నవంబరు 28: మహత్మా జ్యోతిరావు పూలేను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కోరారు. ఆదివారం పూలే వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి రోడ్డులోని పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ, కాంగ్రెస్‌, బీఎస్పీ, బీసీ సంఘం నాయకులు పూలే విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. వావిలాల సరళాదేవి, వెంకట రమేష్‌, తమరాపు రమణమ్మ, సత్యనారాయణ, తాతపూడి మారుతీ రావు, గుబ్బల శ్రీను, డాక్టర్‌ గుబ్బల తమ్మయ్య, ఎస్‌ఎస్‌ రెడ్డి, ఆకుల కిరణ్‌, పొట్ల సురేష్‌, కడలి రామారావు తదితరులు పాల్గొన్నారు.

అత్తిలి: అట్టడుగు వర్గాల సామాజిక అభివృద్ధికి తన జీవితం అంకితం చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని ఎంపీపీ మక్కా సూర్యనారాయణ అన్నారు. వైసీపీ ఆధ్వర్యంలో పూలే వర్ధంతిని అత్తిలి కెనాల్‌ రోడ్డులో గల పార్కులో ఆదివారం నిర్వహించారు. పూలే విగ్రహానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. రంభ సూరిబాబు, కంకటాల సతీష్‌, కానగాని చిన్నా, దాసరి శ్రీనివాస్‌, సబ్బితి రాజేష్‌, కె. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 

నిడదవోలు: వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పని చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు అన్నారు. ఆదివారం  పూలే వర్ధంతిని పురస్కరించుకుని నిడదవోలు లోని తన కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు.  మునిసిపల్‌ చైర్మన్‌ భూపతి ఆదినారాయణ, మద్దిపాటి ఫణీంద్ర, వెలగన పోలయ్య, పువ్వల రతీదేవి, సుంకవల్లి శ్రీహరి పాల్గొన్నారు. దురాచారాలపై పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కేవీపీ ఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు జువ్వల రాంబాబు అన్నారు. నిడదవోలులో ఆదివారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో  పూలేకు నివాళులర్పించా రు. అజీజ్‌ బాషా,  ప్రసన్న, బలరామ్‌, షాహి,  పండు పాల్గొన్నారు.

భీమడోలు: సామాజిక అసమానతలు తొలగించిన కాంతిరేఖ జ్యోతిరావు పూలే అని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అన్నారు.    ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలే మార్గాన్ని నేటి పౌరులు అనుసరించాలని సూచించారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పెంటపాడు:  జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా బీసీ చైతన్య సమితి ఉపాధ్యక్షుడు పొట్నూరి చంద్రశేఖర్‌ అన్నారు. బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో ఆదివారం పెంటపాడు మండలంలోని పడమర విప్పర్రులో పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మండల బీసీ చైతన్య సమితి అధ్యక్షుడు చింతాడ మురళి, ముసునేని శ్రీనివాస్‌, సీహెచ్‌. పవన్‌, జీవ పాల్గొన్నారు.

గణపవరం: జ్యోతిరావు పూలే నేటి తరానికి మార్గదర్శకుడని బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు గాలి ఏసుబాబు అన్నారు. ఆదివారం పిప్పర పంచాయతీ కార్యాలయం వద్ద పూలే వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.   బీసీ నాయకులు వేముల ఏడుకొండలు, మాజీ సర్పంచ్‌ కొప్పిశెట్టి ఏసుబాబు, వీరవల్లి తాతయ్య, గంగరావు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement