త్రికాలాలు

ABN , First Publish Date - 2021-03-29T07:44:54+05:30 IST

చేతికి చిక్కని గతాన్ని రాళ్ళల్లో ఘనీభవింపచేసాడు ఆ దిన మానవుడు ఆది అస్థిర సమయాలను...

త్రికాలాలు

చేతికి చిక్కని గతాన్ని

రాళ్ళల్లో ఘనీభవింపచేసాడు

ఆ దిన మానవుడు


ఆది అస్థిర సమయాలను

అస్థిపంజరంతో సవాల్‌ చేసాడు

ఆదిమ క్షణాల అనంత తత్వాన్ని  

సమాధుల్లో భద్రపరిచాడు


క్షణిక కణాల కాలం 

కనులముందు కరిగిపోతుంది


ఉభయ సంధ్యల్లో 

మంచు బిందువుల్లా

మెరిసి మాయమవుతుంది 

వర్తమానం


నవజాత శిశువుల 

మృదుల పాదాల

అనంత ఆశలతో

అడుగులేస్తుంది

భవిష్యత్‌ కాలం.

బడుగు భాస్కర్‌ జోగేష్‌

98666 02325

Updated Date - 2021-03-29T07:44:54+05:30 IST