Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 13 2021 @ 07:04AM

west bengal టీఎంసీ నేత కాల్చివేత... బీజేపీపై ఆరోపణలు!

కోల్‌కతా: west bengal పశ్చిమ బెంగాల్‌లోని బర్ధ్‌మాన్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ నేతను తుపాకీతో కాల్చి చంపారు. మృతుడు అసీమ్ దాస్ బర్ద్‌మాన్ జిల్లాలో సర్కిల్ అధ్యక్షుడు. దుండగులు అసీమ్ దాస్‌పై చాలా దగ్గర నుంచే కాల్పులు జరిపారు.  పశ్చిమ బెంగాల్‌లో హత్యా రాజకీయాలు నడుస్తున్నాయనడానికి ఇది ఒక ఉదాహరణగా నిలిచింది. ఈ హత్య వెనుక బీజేపీ హస్తముందని టీఎంసీ నేతలు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హంతకుడిని పోలీసులు ఇంకా గుర్తించలేదు. టీఎంసీ చేసిన ఆరోపణల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన మంగళ్‌కోట్ బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. అసీమ్ దాస్ తన గ్రామం వైపు వెళుతుండగా దుండగులు అతనిపై కాల్పులు జరిపారని తెలుస్తోంది. 

Advertisement
Advertisement