Abn logo
Sep 26 2021 @ 00:43AM

నేడు ట్రిపుల్‌ ఐటీ పరీక్షలు

36 కేంద్రాల్లో హాజరుకానున్న 7281 మంది

అనంతపురం విద్య, సెప్టెంబరు 25: జిల్లావ్యాప్తంగా ఆదివారం 36 పరీక్షా కేంద్రాల్లో ట్రిపుల్‌ ఐటీ (ఆర్‌జీయూకేటీ-2021) పరీక్షలు నిర్వహించనున్నా రు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్షలు కొనసాగనున్నాయి. జిల్లాలో మొత్తం 7281 మంది విద్యార్థులు హాజరు కానున్నా రు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని డీఈఓ రంగస్వామి, ఏసీ శ్రీనివాసులు తెలిపారు. కొవిడ్‌-19 నేపథ్యంలో విద్యార్థులు మాస్కులు, శానిటైజర్‌తో హాజరుకావాలన్నారు. పరీక్షకు గంటముందే కేంద్రానికి చే రుకోవాలన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరన్నారు.