Abn logo
Sep 25 2021 @ 00:14AM

26న ట్రిపుల్‌ఐటీ ప్రవేశపరీక్ష

త్రిబుల్‌ఐటీప్రవేశపరీక్ష పరీక్షా కేంద్రాల చీఫ్‌లు, డిపార్టుమెంటు అధికారులు మాట్లాడుతూ డీఈఓ విజయభాస్కర్‌

39 పరీక్షా కేంద్రాలు.. 6,523 మంది విద్యార్థులు 

ఒంగోలు విద్య, సెప్టెంబరు 24 : రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జి టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రిపుల్‌ఐటీల్లో 2021-22 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఈనెల 26న ఆర్జీయూకేటీ సెట్‌-2021 ప్రవేశ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు డీఈఓ బి.విజయభాస్కర్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక డీఆర్‌ఆర్‌ఎం మున్సిపల్‌ హైస్కూలులో నిర్వహించిన పరీక్షా కేంద్రాల చీఫ్‌లు, డిపార్ట్‌మెంట్‌ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 6,523 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినట్లు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని చెప్పారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటిస్తూ పరీక్షకు హాజరు కావాలని కోరారు. పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు జరుగుతుందన్నారు. హాల్‌టిక్కెట్లను ఆర్జీయూకేటీ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. 39 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒంగోలులో 5, దర్శిలో 2, చీరాలలో 2, అద్దంకిలో 2, కందుకూరులో 2, కనిగిరిలో 3, గిద్దలూరులో 2, మార్కాపురంలో 2, చీమకుర్తి, ఎన్‌జీపాడు, పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు, సంతమాగులూరు, సింగరాయకొండ, ఉలవపాడు, వీవీపాలెం, కొండపి, పామూరు, టంగుటూరు, వైపాలెం, కంభం, బీపేట, పెద్దారవీడు, పొదిలి, సీఎస్‌పురం ఒక్కొక్కటి చొప్పున పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు.