Abn logo
Sep 27 2021 @ 00:22AM

ప్రశాంతంగా ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష

ఉన్నత పాఠశాలలో పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులు

మదనపల్లె, సెప్టెంబరు 26: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాలుగు ట్రిపుల్‌ ఐటీ కేంద్రాల్లో (రాజీవ్‌గాంధీ విజ్జాన కేంద్రం) ప్రవేశాలకు ఆదివారం పరీక్షలు నిర్వహించారు. మదనపల్లెలో నాలుగు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. 622 మందికి గాను 594 మంది విద్యార్థులు హాజరయ్యారు. మదనపల్లె జిల్లా పరి షత్తు ఉన్నత పాఠశాలలో రెండు కేంద్రాలు, కోట బడి, బాలికల ఉన్నత పాఠశాలలో ఒక్కో కేంద్రంలో 160 మంది విద్యార్థులు పరీక్ష రాసేలా ఏర్పాటు చే శారు. ఉదయం 11గంటలకు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే పరీక్షకు రెండు గంటలకు ముందుగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. హాల్‌టిక్కెట్టు ఆధారంగా నంబర్లు, గదులను తెలు సుకున్న విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అను మతించారు. ఈ నేపథ్యంలో అన్ని కేంద్రాలు విద్యార్థులు, తల్లిదండ్రులతో రద్దీగా కనిపించాయి. పరీక్షలను ఎంఈవో ప్రభాకర్‌రెడ్డి, ఆయా పాఠశాలల ప్రదానోపాధ్యాయులు పర్యవేక్షించారు.