Abn logo
Sep 26 2021 @ 16:22PM

పెళ్లయిన వారం రోజులకే పుట్టింటికి తిరిగొచ్చిన కూతురు.. భర్త దగ్గరకు వెళ్ళమని ఒత్తిడి చేస్తుంటే ఆమె చెప్పిన నిజాలు విని..

న్యూఢిల్లీ: కోటి ఆశలతో ఆ నవవధువు మెట్టినింట అడుగుపెట్టింది. కానీ వారం రోజులు కూడా కాకముందే తిరిగి పుట్టింటికి వచ్చేసింది. కూతురును భర్త దగ్గరకు వెళ్లమని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. అపుడు ఆమె చెప్పిన నిజాలు విని వారు షాకయ్యారు. ఇంతకీ ఏం జరిగింది?


ఢిల్లీలోని ఎస్‌జిఎం నగర్‌కు చెందిన రూబీకి బెల్కం ఉడ్ మార్కెట్‌కు చెందిన ఫైజాన్‌తో ఈ సంవత్సరం మార్చి 20న వివాహం జరిగింది. రూ. 30లక్షలు ఖర్చు చేసి ఆమె తండ్రి ఘనంగా పెళ్లి చేశాడు. అబ్బాయి దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు పెళ్లికి ముందు చెప్పారు. కూతురు అత్తవారింట్లో సంతోషంగా ఉండాలని లక్షలు వెచ్చించి పెళ్లి చేశాడు ఆ తండ్రి. కానీ అది అతనికి కలగానే మిగిలిపోయింది. ఆమె అత్తారింట్లో అడుగుపెట్టిన ఐదో రోజు నుంచే వారి ప్రవర్తనల్లో మార్పు కనిపించింది. పెళ్లిలో తమకు తక్కువ కట్నం ఇచ్చారని, అదనపు కట్నం తేవాలని ఆమెను వేధించడం మొదలు పెట్టారు. ఎదురుతిరిగి మాట్లాడితే ఆమెపై దాడి చేశారు.


రూబీ చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘నా భర్త వేరే అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడేవాడు. ఆమెను ప్రేమిస్తున్నానని, రెండో పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడు. ఈ విషయం నేను మా అత్త, ఆడపడచుకు చెప్తే వాళ్లు నాపై దాడి చేశారు. ఇంటి నుంచి వెళ్లగొడతామని బెదిరించారు. అందుకే పెళ్లైన ఆరో రోజే నేను పుట్టింటికి వచ్చాను’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. 


బాధితురాలి సోదరుడు మాట్లాడుతూ.. తాము ఫైజాన్ కుటుంబసభ్యులతో ఈ విషయం గురించి మాట్లాడడానికి ఫోన్ చేస్తే వారు స్పందించలేదని అన్నాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 8న ఫైజాన్ వాట్సాప్ కాల్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. పోలీసులు రూబీ ఫిర్యాదు మేరకు ఆమె అత్త, మామ, ఆడపడుచుపై కేసు నమోదు చేశామన్నారు.

ప్రత్యేకంమరిన్ని...