నెగిటివ్ వచ్చినా 7 రోజులు సీఎం క్వారంటైన్

ABN , First Publish Date - 2020-08-04T21:59:51+05:30 IST

కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ 7 రోజుల పాటు తాను హోం క్వారంటైన్‌లోనే..

నెగిటివ్ వచ్చినా 7 రోజులు సీఎం క్వారంటైన్

న్యూఢిల్లీ: కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ 7 రోజుల పాటు తాను హోం క్వారంటైన్‌లోనే ఉంటానని మంగళవారంనాడు ఓ ట్వీట్‌లో ప్రకటించారు. అక్కటి నుంచే తన పనులు నిర్వహిస్తానని చెప్పారు. కోవిడ్‌పై పోరాటం కొనసాగుతుందని, సమష్టిగా కోవిడ్‌పై విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన త్రిపుర ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


దీనికి ముందు, సోమవారం సాయంత్రం బిప్లవ్ దేవ్ ఒక ప్రకటన చేస్తూ, తన కుటుంబంలోని ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని, తక్కిన వారికి నెగిటివ్ వచ్చిందని చెప్పారు. తనకు నెగిటివ్ వచ్చినప్పటికీ తన కుటుంబ సభ్యులు ఇద్దరికి పాజిటివ్ రావడంతో ఆయన ఏడు రోజుల హోం క్వారంటైన్‌కు నిర్ణయించారు. కాగా, ఆయన కోవిడ్ బారిన పడనప్పటికీ, ఆయన సాటి ముఖ్యమంత్రులు, బీజేపీ సహచరులు అయిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కరోనా పాజిటివ్‌ బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం బుధవారంనాడు కరోనా పాజిటివ్‌తో ఆసుపత్రిలో చేరారు.

Updated Date - 2020-08-04T21:59:51+05:30 IST