రైలు వంతెన నిర్మించాలని పట్టాలపై బైఠాయించిన ప్రజలు

ABN , First Publish Date - 2020-08-12T12:14:29+05:30 IST

తమ గ్రామంలో రైలు పట్టాలపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది గ్రామస్థులు రైలు పట్టాలపై బైఠాయించిన ఘటన....

రైలు వంతెన నిర్మించాలని పట్టాలపై బైఠాయించిన ప్రజలు

పానీసాగర్ (త్రిపుర): తమ గ్రామంలో రైలు పట్టాలపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది గ్రామస్థులు రైలు పట్టాలపై బైఠాయించిన ఘటన త్రిపుర రాష్ట్రంలోని నార్త్ త్రిపుర జిల్లా పానీసాగర్ గ్రామం వద్ద వెలుగుచూసింది. పానీ సాగర్ గ్రామంలో రైలు పట్టాలపై వంతెన నిర్మించక పోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయ. 2004 నుంచి రైల్వే క్రాసింగు వద్ద జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు మరణించారు. రైలు పట్టాలు దాటేటపుడు వేగంగా వస్తున్న రైళ్లు ఢీకొని ప్రజలు మరణిస్తున్నారు. ప్రమాదాల నివారణకు తమ గ్రామంలో రైల్వే లెవెల్ క్రాసింగు వద్ద వంతెన నిర్మించాలని డిమాండు చేస్తూ పానీసాగర్ గ్రామస్థులు రైళ్లు రాకపోకలు సాగించకుండా పట్టాలపై బైఠాయించారు. తమ గ్రామంలో రైలు వంతెన నిర్మించేవరకూ తాము రైళ్లు రానీయమని పానీసాగర్ గ్రామస్థులు చెప్పారు. 

Updated Date - 2020-08-12T12:14:29+05:30 IST