Abn logo
Jul 7 2020 @ 13:05PM

త్రిష డిజిట‌ల్ ఎంట్రీ!!

డిజిటల్ రంగానికి క్రమంగా ఆద‌ర‌ణ పెరుగుతోంది. దీంతో సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థ‌లు డిజిట‌ల్ వైపు అడుగులేస్తున్నారు. హీరోయిన్స్‌లో స‌మంత‌, కాజ‌ల్‌, త‌మ‌న్నా వంటి స్టార్ హీరోయిన్స్ ఓటీటీ వైపు అడుగులేశారు. ఇప్పుడు మ‌రో స్టార్ హీరోయిన్ కూడా డిజిట‌ల్ రంగంలోకి అడుగు పెట్ట‌నున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ హీరోయిన్ ఎవ‌రో కాదు.. త్రిష‌. తండ్రీ, కూతురు మ‌ధ్య జ‌రిగే ఎమోష‌న‌ల్ కంటెంట్‌తో తెర‌కెక్క‌బోయే ఈ వెబ్ సిరీస్‌ను రామ్ సుబ్ర‌మ‌ణ్య‌న్ డైరెక్ట్ చేస్తున్నారు. 


Advertisement
Advertisement
Advertisement